Investments in Hyderabad : హైదరాబాద్‌లో క్యాపిటాల్యాండ్ రూ.450 కోట్ల పెట్టుబడి
Investments in Hyderabad : సింగపూర్ కు చెందిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ డెవలప్‌మెంట్ కంపెనీ క్యాపిటాల్యాండ్ గ్రూప్ (CapitaLand Group), హైదరాబాద్‌లో 1 మిలియన్ చదరపు అడుగుల అత్యాధునిక ఐటీ పార్క్‌ను అభివృద్ధి చేయడానికి రూ.450 కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు ప్రకటించింది. సింగపూర్‌లో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర అధికారులు, క్యాపిట ల్యాండ్ ఇండియా ట్రస్ట్ మేనేజ్‌మెంట్ పీటీఈ సహా సీనియర్ క్యాపిటల్యాండ్ ఎగ్జిక్యూటివ్‌లు పాల్గొన్నారు. కంపెనీ CEO & ED గౌరీ శంకర్ నాగభూషణం ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.
కాగా తెలంగాణలో పెట్టుబడులకు క్యాపిటాల్యాండ్ గ్రూప్ ముందుకు వచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హర్షం వ్యక్తం చేశారు. ప్రముఖ వ్యాపార, సాంకేతిక హబ్‌గా హైదరాబాద్ స్థా...