రేపే జగదేకవీరుడు అతిలోకసుందరి రీ రిలీజ్… -Jagadeka Veerudu Athiloka Sundari
మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)సినీ కెరీర్ లోనే నెంబర్ వన్ చిత్రంగా నిలిచిపోయిన మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి ( Jagadeka Veerudu Athiloka Sundari). అతిలోక సుందరి శ్రీదేవి(sridevi)హీరోయిన్ గా, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(raghavendra rao) డైరెక్షన్లో వైజయంతి బ్యానర్ పై అశ్వినీదత్ (ashvinidath)నిర్మించిన ఈ మూవీ 1990 మే 9న రిలీజ్ అయి చరిత్ర సృష్టించింది. సినిమా రిలీజ్ కి ముందు చాలా మందికి ఇది సరిగ్గా ఆడుతుందో లేదో అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమాకు ముందు దర్శకేంద్రుడు డైరెక్ట్ చేసిన మూవీస్ కొన్ని వరుసగా ప్లాప్ లు అవ్వడమే.ఇక అందరూ దర్శకేంద్రుడి పని అయిపోయిందన్నారట.
మెగాస్టార్ చిరంజీవితో మూవీ అనౌన్స్ అయ్యాక మరో ఫ్లాఫ్ ఖాయమని అనుకున్నారు. కానీ దర్శకేంద్రుడు మాత్రం ఛాలెంజ్ తో ఈ మూవీని టేకప్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి కూడా అంత పెద్ద డైరెక్టర్ ఫ్లాప్ లో ఉన్నాడనే డౌట్ లేకుండా డ...