Nagarjuna | శైలేష్ డైరెక్షన్లో నాగార్జున..?
Tollywood News : టాలీవుడ్ కింగ్ నాగార్జున (Tollywood king Nagarjuna) సోలో హీరోగా మూవీ వచ్చి చాలా కాలం అయిపోయింది. నా సామిరంగా మూవీ తర్వాత ఏ సినిమాకు కూడా కమిట్ అవ్వలేదు. రకరకాల కొత్త డైరెక్టర్ల పేర్లు వినిపిస్తున్న కూడా అవి రూమర్ గానే మిగిలాయి. నాగ్ నెక్స్ట్ మూవీ ఎవరితో అన్న ప్రశ్న చాలా రోజులుగా వినపడుతూనే ఉంది. దీనికి కారణం నాగ్ కెరీర్ లో ఇది 100 వ సినిమా కావడమే. అత్యంత ప్రతిష్టాత్మకంగా నాగ్ కెరీర్ లోనే ఒక మైలురాయిగా నిలబడిపోయే మూవీ కావడంతో అది ఎవరి చేతుల్లో పెడదాం అన్న చర్చ జరుగుతూనే ఉంది.
Nagarjuna కొత్త సినిమా
ఆ మధ్య ఇద్దరు తెలుగు డైరెక్టర్లు, తర్వాత తమిళ్ డైరెక్టర్ ల పేర్లు వినిపించిన కూడా అవి చర్చల దశలోనే ఆగిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ శేఖర్ కమ్ముల(Shekar kammula)డైరెక్షన్ లో ధనుష్ హీరోగా వస్తున్న కుబేర (Dhanush kubera),అలాగే లోకేష్ కనకరాజు(Lokesh kanagaraj)డైరెక్షన...