Sivakarthikeyan | త్రివిక్రమ్ శివ కార్తికేయన్ కాంబో కుదిరిందా..?
Sivakarthikeyan New Movie : మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram )మెగా ఫోన్ పట్టక చాన్నాళ్ళే అవుతుంది. గుంటూరు కారం మూవీ హిట్ తర్వాత ఏ సినిమా చేయాలో తెలియక అయోమయంలో ఉన్నాడు. ఆ మధ్య అల్లు అర్జున్ (Allu Arjun)తో చాలాకాలం పాటే ట్రావెల్ చేసి ఒక సినిమాను ప్లాన్ చేశాడు. మైథాలజికల్ జానర్లో సినిమా రానున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ స్క్రిప్ట్ కు ఇంకా మెరుగులు దిద్దాల్సి ఉండడం తో మరికొన్నాళ్లపాటు వెయిట్ చేయక తప్పడం లేదు. దీంతో ఈ కాంబోలో మూవీ ప్రస్తుతానికి ఆగిపోయింది. ఈ ఏడాది చివర్లో ఈ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతాయని ఫిలింనగర్ నుండి టాక్ వినబడుతుంది.
ఈ గ్యాప్ లో అల్లు అర్జున్ కూడా అట్లీ వైపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ మరికొన్ని రోజుల్లో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ మధ్య ఈ మూవీకి సంబంధించిన చిన్న వీడియోను కూడా నెట్టింట్లో వదిలారు.దీన్ని చూశాక ఆడియన్స్ ఇండియన్ స్క్రీన్...