OTT : దుమ్ము రేపే క్రేజీ వెబ్ సిరీస్ లు ఈ సంవత్సరమే స్ట్రీమింగ్…..
OTT : వెబ్ సిరీస్ ల ట్రెండ్ మొదలైన దగ్గర నుండి ఇప్పటివరకు చాలా వెబ్ సిరీస్ లే వచ్చాయి. అందులో కొన్ని వెబ్ సిరీస్ లకు ఆడియన్స్ లలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజీ వెబ్ సిరీస్ ల సీక్వెల్స్ కొన్ని ఈ ఏడాది రాబోతున్నాయి.
OTT లోకి ఫ్యామిటీ మాన్ 3
అందులో మొదటి వరుసలో ఉన్నది ఫ్యామిలీ మ్యాన్ (family man). ఉగ్రవాదుల దాడి నేపద్యంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. మనోజ్ బాజ్ పాయి నటన, వెబ్ సిరీస్ లో థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకులను కట్టిపడేసింది.
దీనికి కొనసాగింపుగానే సీజన్ 2 (familyman-2) వచ్చి మొదటి సీజన్ కంటే ఎక్కువ హిట్ గా నిలిచింది. సమంత (samantha) చేసిన యాక్షన్ సన్నివేశాలు ఆడియన్స్లో థ్రిల్ ను కలిగించాయి. ఇప్పుడు సీజన్ 3(familyman -3) రాబోతుంది. ఇటీవల షూటింగ్ కూడా పూర్తయిందని మేకర్స్ ట్వీట్ చేశారు. తేదీ ప్రకటించలేదు కానీ ఓటీటీ లో స్ట్రీమింగ్ కావడానికి ఎక్కువ రో...