Daaku Maharaaj Chinni Song | క్లాస్‌ను.. మాస్ ను ఆకట్టుకుంటున్న చిన్నీ పాట
Daaku Maharaaj Chinni Song | తమన్, అనంత శ్రీరామ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, సినీ గేయ రచయితల నుంచి వచ్చిన లేటెస్ట్ సాంగ్ ‘చిన్ని’ అనే టైటిల్‌తో వచ్చిన సాంగ్ యూట్యూబ్ లో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. సింగర్ విశాల్ మిశ్రా అద్భుతంగా ఆలపించిన ఈ పాట.. బాలకృష్ణ (Nandamuri Balakrishna)పాత్ర, ఒక చిన్నారి ప్రధాన పాత్ర మధ్య ఉన్న అపురూపమైన బంధాన్ని ప్రతిబింబిస్తుంది. హిల్ స్టేషన్‌లోని సుందరమైన ప్రదేశాల మధ్య చిత్రీకరించబడిన ఈ పాట మనస్సులను హత్తుకుంటోంది.
ఇటు క్లాస్, అటు మాస్ ఆడియన్స్‌ని అలరించేలా రూపొందించిన పాటలతో సినిమాలో ఈ పాట మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. జనవరి 2025 మొదటి వారంలో, అద్భుతమైన బీట్స్‌తో కూడిన మాస్ సాంగ్ విడుదల కానుంది. ఈ పాటను బాలయ్య, ఊర్వశి రౌటేల(Urvashi Rautela)పై చిత్రీకరించారు.
జనవరి 12న థియేటర్లలో విడుదల కానున్న డాకు మహారాజ్, దాని ట్రై...