Vishal : మద గజ రాజా స్ఫూర్తితో మరో మూవీ రిలీజ్..?
kollywood News | కోలీవుడ్ హీరో విశాల్ (Hero Vishal ) నటించిన మద గజ రాజా (Madha Gaja Raja) సంక్రాంతికి విడుదలై భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ మూవీ చిత్రీకరణ 12 ఏళ్ల క్రితమే పూర్తయినా కొన్ని కారణాలవల్ల అప్పుడు విడుదలకు నోచుకోలేదు. రిలీజ్ అయిన నాటి నుండి ఈ మూవీ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.
తమిళంలో దాదాపు 60 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇంకా కొన్ని రోజుల్లో 100 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు. 12 ఏళ్ల క్రితం తీసిన మూవీ ఇప్పుడు విడుదలై 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించడం అనేది మామూలు విషయం కాదు.
ఈ మూవీ ఇచ్చిన స్ఫూర్తితో చిత్రీకరణ పూర్తయి మరుగున పడి ఉన్న మరిన్ని మూవీస్ కూడా విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఆ కోవలోకే ఇప్పుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధ్రువ నక్షత్రం విడుదల కానుంది. ఈ విషయాన్ని ఓ ఇంటర...




