Sarkar Live

Cinema

Ram Charan | రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న మూవీకి టైటిల్ ఇదే…?
Cinema

Ram Charan | రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబోలో వస్తున్న మూవీకి టైటిల్ ఇదే…?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janvi Kapur)జంటగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు (Bucchi babu) దర్శకుడుగా రూపొందుతున్న మూవీ కి టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్లు పూర్తి చేసుకున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. అసిస్టెంట్ డైరెక్టర్ గా సుకుమార్ దగ్గర పని చేసిన బుచ్చిబాబు దర్శకుడి గా మారి వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన మూవీని తెరకెక్కించారు. మొదటి మూవీతోనే సాలిడ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ మూవీ వచ్చి 4 సంవత్సరాలు అయినా రామ్ చరణ్ తో మూవీ చేయడానికి వెయిట్ చేశాడు. రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్ లో మూవీ గేమ్ చెంజర్ అయిపోయాక ఈ సినిమా చిత్రీకరణలో జాయిన్ అయ్యాడు. గేమ్ చేంజర్ బడ్జెట్ 450 కోట్లు పెట్టిన వసూళ్లు మాత్రం 200 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. కొందరు ఆడియన్స్ ఈ మూవీని డిజాస్టర్ అని తేల్చేశారు. కొందరు అభిమానులు మాత్రం మూవీ బాగుందని దీనికంటే డాకు ...
Bhairavam : భైరవం టీజర్ వచ్చేసింది…
Cinema

Bhairavam : భైరవం టీజర్ వచ్చేసింది…

Bhairavam Teaser Released : మిరపకాయ్, రామయ్య వస్తావయ్య, సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా దువ్వాడ జగన్నాథం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలకు కో డైరెక్టర్ గా పని చేశారు డైరెక్టర్ విజయ్ కనకమేడల(Vijay Kanakamedala). అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నాంది సినిమాతో డైరెక్టర్ గా మారి ఆ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో రెండో మూవీ తనతోనే ఉగ్రం అనే మూవీ తీశారు. 2012లో భీమినేని శ్రీనివాసరావు డైరెక్షన్లో వచ్చిన సుడిగాడు మూవీ తో హిట్టు కొట్టిన అల్లరి నరేష్ దాదాపు 11 సంవత్సరాలు తను తీసిన సినిమాలన్నీ ప్లాఫ్ అయ్యాయి. చాలా సంవత్సరాల తర్వాత నాంది మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆ మూవీ సక్సెస్ మీట్ లో ఆయన ఎమోషనల్ అయ్యారు. వరుసగా రెండు భారీ హిట్లు కొట్టిన విజయ్ కనకమేడల మూడో మూవీ భైరవం (Bhairavam Movie) చేస్తున్నారు. ఈ మూవీని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కే రాధ మోహన్ నిర్మిస్తున్నారు.బెల్లంకొండ శ్రీనివా...
Victory Venkatesh : విక్టరీ వెంకటేష్ ఆ ఫీట్ అందుకుంటాడా…
Cinema

Victory Venkatesh : విక్టరీ వెంకటేష్ ఆ ఫీట్ అందుకుంటాడా…

Victory Venkatesh : ఫ్యామిలీ ఆడియన్స్ కి అప్పటి తరంలో శోభన్ బాబు తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh)అని చెబుతారు. ఆయన సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతగా ఆదరిస్తారు మనకు తెలిసిందే. ఎక్కువగా వారిని దృష్టిలో పెట్టుకుని సినిమాలను చేస్తుంటారు. కెరీర్లో మొదట యాక్షన్ సినిమాలను చేసిన తర్వాత ఫ్యామిలీ మూవీస్ చేసి అభిమానులను పొందారు. ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఇండస్ట్రీకి నాలుగు స్తంభాలుగా ఉండి పోటాపోటీగా సినిమాలు చేస్తూ ఒకరి రికార్డులను మరొకరు కొల్లగొడుతూ మంచి మంచి సినిమాలను తీశారు. వారికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నారు. కానీ ఈ నలుగురిలో మెగాస్టార్ (Megastar) మాత్రమే ఒక ఫీట్ సాధించారు. సైరా నరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలతో 200 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టి న హీరోగా ఆ ఫీట్ రెం...
Dhruva Natchathiram : ధృవ నక్షత్రం విడుదల ఎప్పుడో..?
Cinema

Dhruva Natchathiram : ధృవ నక్షత్రం విడుదల ఎప్పుడో..?

Dhruva Natchathiram Release Date : రాఘవన్, ఘర్షణ, ఏ మాయ చేసావే, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి గొప్ప గొప్ప సినిమాలు తీసిన డైరెక్టర్ గౌతమ్ మేనన్. ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతి నటులకు ఉంటుంది. ప్రేమ కథలను చాలా హృద్యంగా తీయడంలో ఈయన దిట్ట. గత కొన్ని సంవత్సరాల నుంచి ఈయన దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా రాలేదు కానీ నటుడుగా మాత్రం పలు సినిమాల్లో చేసే బిజీగా మారారు. నాగచైతన్య మొదటి సినిమా ఏం మాయ చేసావే తోనే మొదటి బ్లాక్ బస్టర్ అందుకున్నారు సమంత ఈ మూవీ తోని వెండితెరకు పరిచయమైంది. విక్రమ్ హీరోగా ఈయన దర్శకత్వంలో ధ్రువ నక్షత్రం అనే మూవీ తెరకెక్కింది. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ మూవీ విడుదలకు నోచుకోలేదు. పలుమార్లు విడుదల తేదీలను ప్రకటించిన వాయిదా పడడం జరుగుతూ వస్తోంది. దీనిపై లేటెస్ట్గా గౌతమ్ మేనన్ మాట్లాడారు. ఈ చిత్రం విడుదల కాకపోవడం నన్ను నా కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేస్తుంద...
Manchu Manoj : ‘మంచు ఫ్యామిలీ’ గొడవలకు పుల్ స్టాప్ పడేనా..?
Cinema

Manchu Manoj : ‘మంచు ఫ్యామిలీ’ గొడవలకు పుల్ స్టాప్ పడేనా..?

Manchu Manoj : ఇండస్ట్రీకి వచ్చి ఎంతో కష్టపడి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి దర్శకరత్న దాసరి నారాయణరావు డైరెక్షన్లో స్వర్గం నరకం చిత్రంతో నటుడుగా మారారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. చాలా సినిమాల్లో విలన్ గా చేసినా ఆ తర్వాత నటుడిగా నిలదొక్కుకుని హీరోగా మారారు. కొన్ని సినిమాలు చేశాక తనే నిర్మాతగా మారి దాదాపు 75 సినిమాలను నిర్మించారు. తిరుపతిలో ఒక స్కూల్ ని స్థాపించి విజయవంతంగా నడిపించారు. ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరు మోహన్ బాబు (Mohan Babu) అని చెబుతుంటారు. అయితే కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీ లో గొడవలు తారా స్థాయికి చేరాయి. అన్ని గొడవలు సద్దుమనిగాయి అనుకున్న తరుణంలోనే మళ్లీ కొత్త వ్యవహారంతో మలుపులు తీసుకుంటుంది. మంచు మనోజ్ యూనివర్సిటీకి వచ్చి హల్చల్ చేయడం, దానిపై మోహన్ బాబు రియాక్ట్ అయి అతనిపై ఫిర్యాదు చేయడం, మనోజ్ కూడా ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్ కు వెళ్తున్నానని చెప్పి పోలీ...
error: Content is protected !!