Benefit shows | బెనిఫిట్ షోలు, టికెట్ల ధరల పెంచడం కుదరదు..
CM Revanth Reddy On Benefit shows | హైదరాబాద్: ప్రజల భద్రతకు సంబంధించిన ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఇకపై ప్రభుత్వం అలాంటి బెనిఫిట్ ఫోలకు అనుమతించబోదని, తెలుగు చిత్ర పరిశ్రమలో బెనిఫిట్ షోలపై నిషేధం విధిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
సినిమా టికెట్లపై విధించే సెస్ ను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి వినియోగించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండదని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా ఎవరిపైనా కేసులు పెట్టలేదని సీఎం రేవంత్ స్పష్టత ఇచ్చారు. కాగా ఈ సమావేశంలో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని సినీ ప్రముఖులకు పోలీసులు చూపించార...




