Vikrant Massey | 12th Fail హీరో విక్రాంత్ షాకింగ్ నిర్ణయం..
Vikrant Massey | 12th Fail మూవీతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు విక్రాంత్ మాస్సే (Vikrant Massey) సంచలన నిర్ణయం తీసుకున్నారు. కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ నోట్ పెట్టారు. కొన్నేళ్లుగా అందరి నుంచి అసాధారమైన ప్రేమ, అభిమానాన్ని పొందుతున్నానని, చెప్పారు. ఇప్పటి వరకూ తనకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఓ తండ్రిగా, కొడుకుగా, భర్తగా బాధ్యతలు నెరవేర్చాల్సిన సమయం వొచ్చిదని అందుకే కొత్త సినిమాలను అంగీకరించడం లేదని పేర్కొన్నారు. ‘గత కొన్నేళ్లు అద్భుతంగా గడిచాయి. ఇంతకాలం నాపై ప్రేమ, అభిమానం చూపినవారందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు నా కుటుంబం కోసం సమయం వెచ్చించాల్సిన టైమ్ వచ్చింది. 2025లో రిలీజ్ అయ్యే సినిమానే నా చివరి మూవీ’ అని విక్రాంత్ మాస్సే ప్రకటించారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానులతోపాటు సినీ ప్రియులు ఆశ్...



