బెయిల్ గ్రాంటెడ్. బట్ కండీషన్ అప్లై.. రాంగోపాల్ వర్మకు ఊరట
Ramgopal varma : ఎప్పుడూ ఏదో ఒక సందర్భంగా ఎవరో ఒకరి మీద నోరు పారేసుకోవడం సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ నైజం. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, పోస్టులతో ఆయన ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌పై కూడా అనుచిత పోస్టులు పెట్టిన రాంగోపాల్ వర్మ ఇరుకాటంలో పడ్డారు. దీనిపై కేసును ఎదుర్కొని అజ్ఞాతంలోకి వెళ్లిన ఆయనకు ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది. ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశించింది. పోలీసులు కోరినప్పుడు విచారణకు కచ్చితంగా హాజరు కావాలని కండీషన్ పెట్టింది.
రాంగోపాల్ వర్మ ఏం చేశారంటే...
రాంగోపాల్ వర్మ సారథ్యంలో రూపొందించిన ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు, నారా లోకేశ్, బ్రాహ్మణి, పవన్ కల...




