Power Star | వీరమల్లు ట్రైలర్ వచ్చేస్తోంది….
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మూవీ హరిహర వీరమల్లు (Harihara Veeramallu). 4 ఏళ్ల క్రితం మొదలైన ఈ మూవీ అన్ని అడ్డంకులను దాటుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది.ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజైన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రజెంట్ జెట్ స్పీడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకుంటుంది. పవర్ స్టార్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీపై ఫాన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.
మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించే ధీరుడు…
మొగల్ సామ్రాజ్యాన్ని ఎదిరించే ఒక యోధుడిగా పవన్ విశ్వరూపాన్ని చూపెట్టబోతున్నట్టు మూవీ టీం చెబుతోంది. రెండు పార్ట్ లుగా రాబోతున్న ఈ మూవీని మొదట క్రిష్(krish)డైరెక్ట్ చేశాడు.ఆ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అవ్వడం వల్ల క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు.ఆ బాధ్యతలను ప్రొడ్యూసర్ ఎ ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్...