Trivikram | త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాలపై క్లారిటీ
వెంకటేష్, ఎన్టీఆర్‌తో రెండు భారీ ప్రాజెక్టులు
Trivikram Next Movies 2025 | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram)నుండి మూవీ వచ్చి చాలా కాలమే అయిపోయింది. సూపర్ స్టార్ మహేష్ బాబు(super star Mahesh Babu)తో గుంటూరు కారం (guntur kaaram) మూవీ తర్వాత అల్లు అర్జున్(Allu Arjun)తో మూవీ ప్లాన్ చేసుకున్నారు. ఆ మూవీ స్క్రిప్ట్ పై చాలా కాలం వర్క్ చేశాడు. మైథాలజికల్ జానర్లో మూవీ ఉండబోతుందని కూడా ప్రచారం జరిగింది. పూర్తి స్క్రిప్ట్ రెడీ కానందువల్ల డిలే అవుతూ వచ్చింది.
అంతలో పుష్ప 2(pushpa -2) తో ఇండియన్ రికార్డులు క్రియేట్ చేసి సుకుమార్ అల్లు కాంబో భారీ కలెక్షన్స్ రాబట్టింది. త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తీయబోయే మూవీ ఈ టైమ్ లో కరెక్ట్ కాదనుకున్నారో ఏమో అట్లీ లైన్ లోకి వచ్చాడు. అల్లు అట్లీ(Allu Atlee combo) కాంబో సినిమా అనౌన్స్ మెంట్ కూడా అయిపోయింది. ఇందులో హీరోయిన్ గా దీపిక పదుకొనె (Deepika Padukon...