ACB Raids | రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డిప్యూటీ కమిషనర్
ACB Raids in Hyderabad | హైదరాబాద్ లో మరో అవినీతి అధికారి ఏసీబీ (ACB) అధికారులకు పట్టుబడ్డాడు. ప్రజలకు సేవ చేయాల్సిన అధికారి.. కేవలం డబ్బుపై ఆశతో లంచం తీసుకుంటుగా ఏసీబీ అతడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రాజేంద్రనగర్ (Rajendranagar) మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ కె. రవికుమార్ ఓ హోటల్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు శుక్రవారం ఆయనను రూ.2 లక్షలు లంచం తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. రాజేంద్రనగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ (Deputy Commissioner) కె రవికుమార్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. మున్సిపల్ పరిధిలోని ఒక హోటల్‌లో ఇటీవల మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. కిచెన్‌లో అపరిశుభ్రంతో పాటు నాణ్యత లేని ఆహారాన్ని అందిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సదరు హోటళ్లపై దాడులు...