Sarkar Live

Crime

RTC Strike | నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత: డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం
Crime

RTC Strike | నర్సంపేట ఆర్టీసీ డిపో వద్ద తీవ్ర ఉద్రిక్తత: డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న శంకర్ గౌడ్.. 90 శాతం కాలిన గాయాలతో ఎంజీఎంకు తరలింపు! RTC Strike | తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉగ్రరూపం దాల్చుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్న కార్మికులు, ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ప్రాణత్యాగాలకు సిద్ధపడుతుండటం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. తాజాగా వరంగల్ జిల్లా నర్సంపేట (Narsampet) డిపో వద్ద ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌ గౌడ్ (Shankar Goud) ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని.. నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న బోలా శంకర్ గౌడ్ () , గత రెండు రోజులుగా సాగుతున్న సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే, ప్రభుత్వంతో జరిగిన చర్చలు విఫలం కావడం, తమ డిమాండ్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆవేదనతో ఆయన తీవ్ర మనోవేదనకు గురయ్యారు. నిరసన ప్రదర్శన జరుగుతున్న స...
తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి
Crime

తెలంగాణలో ఆరుగురు ఐపీఎస్ అధికారులకు డీజీలుగా పదోన్నతి

తెలంగాణ పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు చోటుచేసుకున్నాయి. ఆరుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ (డీజీ) హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. 1995, 1996 బ్యాచ్‌లకు చెందిన అధికారులకు ఈ పదోన్నతులు లభించాయి.డీజీలుగా ప్రమోషన్ అందుకున్న వారిలో వీవీ శ్రీనివాసరావు, మహేష్ భగవత్, వీసీ సజ్జనార్, స్వాతి లక్రా, చారు సిన్హా, అనిల్ కుమార్  ఉన్నారు....
వరంగల్‌లో భారీగా పట్టుబడ్డ ‘హాష్ ఆయిల్’: రూ. 2.50 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
Crime

వరంగల్‌లో భారీగా పట్టుబడ్డ ‘హాష్ ఆయిల్’: రూ. 2.50 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. చరిత్రలో నిలిచిపోయేలా తొలిసారిగా సుమారు రూ. 2 కోట్ల 50 లక్షల విలువైన హాష్ ఆయిల్‌ను (గంజాయి నూనె) స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ వెల్లడించారు. వరంగల్ డ్రగ్ కంట్రోల్ టీం, క్యాట్ పార్టీ మరియు ఇంతేజార్‌గంజ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ​అరెస్ట్ అయిన నిందితులు.. ​హంటల్ సన్ను (23) – మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా (ప్రధాన నిందితుడు) ​హంటల్ సన్యాసి (23) – మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా ​కండెల చిన్నబాబు (56) – అల్లూరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ​కృష్ణ హంటల్ (56) – మల్కాన్‌గిరి జిల్లా, ఒడిషా  మరో నిందితుడు కిలో పాండు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు ​కేసు వివరాలు ఇలా ఉన్నాయి.. ​పోలీస్ కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. ...
ACB | బిల్లు కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ
Crime

ACB | బిల్లు కోసం రూ. 50 వేలు లంచం డిమాండ్‌.. ఏసీబీకి చిక్కిన మున్సిపల్ ఏఈ

అవినీతి అధికారుల వేటలో తెలంగాణ ఏసీబీ (ACB) దూకుడు పెంచింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అసిస్టెంట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఒక అధికారి, కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. పనులు పూర్తి చేసినా, బిల్లులు ఆపేసి వేధిస్తున్న తీరుపై విసిగిపోయిన బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఏం జరిగిందంటే..? హుజూరాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఒక కాంట్రాక్టర్ తుపాను నీటి కాలువ (Storm Water Drain) నిర్మాణ పనులను పూర్తి చేశారు. ఈ పనులకు సంబంధించిన మెజర్మెంట్ బుక్ (M-Book) లో వివరాలు నమోదు చేసి, ఫైనల్ బిల్లును ప్రాసెస్ చేయాల్సి ఉండగా.. అసిస్టెంట్ ఇంజనీర్ (AE) నుసుం సుధాకర్ రెడ్డి చక్రం తిప్పాడు. పని పూర్తి చేసినందుకు 'ఆఫీస్ ఫేవర్' కింద రూ. 50,000 లంచం ఇవ్వాలని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశా...
అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం: ఎస్సై  సస్పెన్షన్
Crime

అవినీతి, విధి నిర్వహణలో నిర్లక్ష్యం: ఎస్సై  సస్పెన్షన్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సతీష్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్  సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ​ఎస్సై సతీష్‌పై గత కొంతకాలంగా ఉన్నతాధికారులకు పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో జరిగిన అంతర్గత విచారణలో ,విధి నిర్వహణలో భాగంగా పలువురి నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.​నమోదైన కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించడం, బాధితులకు సకాలంలో స్పందించకపోవడంపై విచారణాధికారులు నివేదిక అందించారు.ప్రాథమిక విచారణలో ఈ ఆరోపణలు నిజమని తేలడంతో క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సిపి ఆయనను సస్పెండ్ చేశారు.​శాంతిభద్రతల పరిరక్షణలో కీలక పాత్ర పోషించాల్సిన అధికారులే అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఈ సస్పెన్షన్ ద్వారా పోలీస్ కమిషనరేట్ బలమైన సంకేతాలను పంపింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీస్ వ...
error: Content is protected !!