Chinese Manja : చైనా మాంజా వ్యాపారులపై ఫోకస్.. 22 మందిపై 18 కేసులు
Chinese Manja హైదరాబాద్ : సంక్రాంతి సమీపిస్తుండడంతో చిన్నాపెద్దా అనే తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేస్తూ కేరింతలు కొడుతుంటారు. పట్టాణాలు, పల్లెల్లో ఎక్కడ చూసినా ఆకాశంలో రంగురంగుల పతంగులు కనువిందు చేస్తుంటాయి. అయితే ఇటీవల కాలంలో గాలిపటాలకు చైనా మాంజా ఉపయోగిస్తుండడంతో అవి మెడకుచుట్టుకొని పిల్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఆందోళన కలిగించాయి. చైనా మాంజాపై ప్రభుత్వం ఎప్పటినుంచో నిషేధం విధించినప్పటికీ కొందరు వ్యాపారులు అదేమీ పట్టించుకోకుండా యథేచ్చగా విక్రయాలు జరుపుతున్నారు.
Chinese Manja seized : అయితే పిల్లల ప్రాణాలు తీస్తున్న ఈ చైనా మాంజాపై హైదరాబాద్ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గత 20 రోజుల్లో మంగళ్‌హాట్ పోలీసులు (Hyderabad Mangalhat police) పలు దుకాణాలపై దాడులు చేసి చైనా మాంజా విక్రయిస్తున్న 22 మందిపై 18 కేసులు నమోదు చేశారు. సింథటిక్ మెటీరియ...