Madhapur Accident | మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంత తీవ్రంగా అంటే..
Accident in Madhapur : హైదరాబాద్‌లోని మాదాపూర్ (Madhapur) లో హోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు యువకులు బైక్‌పై అతి వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొన్నారు. దీంతో ఇద్దరూ ప్రాణాలు వదిలారు. డివైడర్‌కు ఢీకొనడంతో బైక్ నుంచి మంటలు రావడం ఈ ప్రమాద తీవ్రతను సూచిస్తోంది. బైక నడిపేటప్పుడు హెల్మెంట్ ధరించలేదని తెలుస్తోంది. ఈ దృశ్యాలను సీసీ కెమెరాల్లో (CCTV footage ) నమోదయ్యాయి.
భయానక దృశ్యం
హైదరాబాద్‌లోని బోరబండాకు చెందిన రఘుబాబు (29) ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీ ((Software Company))లో ఉద్యోగం చేస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆకాంక్ష్ (27) ఐటీ రంగంలో కొత్తగా చేరాడు. ఇద్దరూ మంచి స్నేహితులు. వారిని చివరిసారి ఓ బార్‌షాపులో చూసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. శుక్రవారం రాత్రి వీరద్దరూ బైక్‌పై బయల్దేరారు. మద్యం మత్తు ద్విచక్రవాహనాన్ని అతివేగంగా నడపడంతో...