Adilabad | పిడుగుపాటుకు ఆరుగురు రైతులు మృతి, ఐదుగురికి గాయాలు
Lightning strike incident in Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో ప్రకృతి కన్నెర్ర చేసింది. గురువారం జరిగిన మూడు వేర్వేరు పిడుగుపాటు సంఘటనలలో ఆరుగురు రైతులు (వారిలో నలుగురు మహిళలు) ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి, ఆ ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
బేలా గ్రామంలో ఉదయం మొదటి పిడుగుపాటు సంభవించింది.. ఈ ఘటనలో పొలాల్లో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మరణించారు. కొద్దిసేపటికే, గాధిగూడ మండల పరిధిలోని పిప్రి గ్రామంలో మరో ఘటన జరిగింది, ఇందులో ఇద్దరు మహిళలు సహా నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా కాలిన గాయాలకు గురయ్యారు. మధ్యాహ్నం తరువాత, కుమ్మరి తండాలో మరో పిడుగుపాటు సంభవించి ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు.
అందరూ వ్యవసాయ కూలీలే..
ఈ ఘటనలో గాయపడిన ఐదుగుర...




