ACB Raids | రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీకి చిక్కిన పీఆర్ ఏఈ
ACB Raids in Peddapalli : లంచగొండి అధికారి ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం గంగారం వద్ద పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ రూ.90 వేలు లంచం తీసుకుంటుండగా కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
కాల్వ శ్రీరాంపూర్ పంచాయతీరాజ్ ఏఈ జగదీష్ ఓదెల మండలం బాయమ్మపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వద్ద నుంచి సీసీ రోడ్డు బిల్లు మంజూరు కోసం ఏకంగా రూ.90 వేలు డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు విసిగిపోయి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కగా వల పన్ని.. బాధితుడి నుండి ఏఈ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు.ఈసందర్భంగా డిఎస్పీ విజయ్ కుమార్ మాట్లాడుతూ… ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు.
ACB కి ఇలా ఫిర్యాదు చేయవచ్చు..
వరైనా ప్రభుత్వ అధికారి లేదా సిబ్బంది లంచం అడిగితే ప్రజలు త...