Pasmailaram Blast | పాశమైలారం ఘటనలో 45కి చేరిన మృతుల సంఖ్య
గుర్తించలేని స్థితిలో మృతులు..
డీఎన్‌ఏ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న ప్రభుత్వం
Sangareddy | సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం పాశమైలారం (Pasmailaram ) పారిశ్రామికవాడలోని సిగాచి క్లోరో కెమికల్స్ భారీ పేలుడు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 45కి చేరింది. ఇది తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా కొందరు భావిస్తున్నారు.NDRF, HYDRAA, తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు రేయింబవళ్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
వివిధ ఆసుపత్రులలో 35 మంది చికిత్స పొందుతుండగా, వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. బహుశా, ఇది తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద పారిశ్రామిక ప్రమాదంగా పలువురు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్‌చెరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, అక్కడి నుండి మృతదేహాలను వారి స్వస్థలాలకు తరలించడానికి ప్రభుత్వ...