ప్రియుడి కోసం భర్త, 22 ఏళ్ల కూతురిని హత్య చేసిన తల్లి – Jayashankar Bhupalapalli
Mother kills husband and daughter : జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalapalli) జిల్లా చిట్యాల మండలం వొడితల గ్రామంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త పక్షవాతంతో మంచాన పడిపోవడంతో సపర్యలు చేయాల్సిన భార్య అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం బయటపడిపోతుందనే భయంతో, ఆమె ప్రియుడి సాయంతో భర్తతో పాటు తన 22 ఏళ్ల కూతురును కూడా కడతేర్చింది.
వివరాల్లోకి వెళ్తే, జూన్ 25న కవిత తన భర్తను హత్య చేసి, అనారోగ్యంతో చనిపోయాడని అందరినీ నమ్మించింది. అంత్యక్రియలు కూడా పూర్తయ్యాక ఎలాంటి అనుమానం రాకుండా చూసుకుంది. అయితే, తమ సంబంధం విషయం కుమార్తెకు కూడా తెలిసిపోతుందనే భయంతో 22 ఏళ్ల కూతురినీ పక్కా ప్లాన్ వేసి హత్య చేసింది.
కూతురు మృతదేహాన్ని భూపాలపల్లి–కాటారం హైవే పక్కన అడవిలో పడేసి, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ చల్లి, ఆధార్ కార్డు ఉంచి, క్షుద్రపూజల వల్లే చనిపోయిందనే ఊరి జ...


