Jaya Ekadashi 2025 | జయ ఏకాదశి విశిష్టత.. తేదీ, సమయాలు, వ్రత కథ ..
Jaya Ekadashi 2025 | జయ ఏకాదశి మాఘ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే పదకొండవ తిథి. ఈ ఏకాదశి (Ekadashi) హిందూ మతంలో అత్యంత పవిత్రమైనది. ఈ రోజున భక్తులు విష్ణుమూర్తిని పూజించి, ఉపవాసం ఉంటారు. ఇది వారికి పాప విమోచనం కలిగిస్తుందని, స్వర్గలోక ప్రాప్తి సాధ్యమవుతుందని నమ్ముతారు.
Jaya Ekadashi … పురాణ గాథ
పురాణ గాథల ప్రకారం ఒకసారి స్వర్గలోకంలో గంధర్వుడు మాల్యవాన్ అనే యువకుడు పుష్పవతి అనే గంధర్వ యువతితో ప్రేమలో పడి స్వర్గ రాజ్య నియమాలను అతిక్రమించాడు. అతని వైకల్యం కారణంగా దేవేంద్రుడు కోపగించి మాల్యవాన్‌ను భూమికి పంపించాడు. అతడు పిశాచ రూపాన్ని ధరించి భూమిపై చాలా సంవత్సరాల పాటు కష్టాలు అనుభవించాడు. కానీ, కొద్ది కాలం తర్వాత మాఘ శుక్ల ఏకాదశి రోజు అనుకోకుండా ఉపవాసం చేయడం వల్ల అతనికి విముక్తి లభించింది. అతను తిరిగి తన మానవ రూపాన్ని పొంది స్వర్గలోకి చేరాడు.జయ ఏకాదశి ఉపవాసం వల్ల పాప విమోచనం, భవబంధ విప్పు,...