Lok Sabha Debate | పాకిస్థాన్ వేడుకోవడంతోనే కాల్పుల విరమణ..!
‘ఆపరేషన్ సిందూర్’పై లోక్‌సభలో ఈ రోజు వాడీవేడీగా చర్చలు (Lok Sabha Debate) సాగాయి. విపక్ష నేతలు సంధించిన ప్రశ్నలకు ప్రధాని మోదీ బృందం దీటుగా సమాధానమిచ్చింది. మంగళవారం జరిగిన చర్చలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) సహా హోం మత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రతిపక్షాల వాదనలను కొట్టిపారేశారు. పార్లమెంట్ వేదికగా కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రమేయం లేదని మోదీ తేల్చి చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత సైన్యం పాకిస్థాన్‌కు వణుకు పుట్టించిందని తెలిపారు.’ దయచేసి దాడులు ఆపండి’ అని పాక్ డీజీఎంఓ మన డీజీఎంఓను వేడుకోవడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించామని సభకు మోదీ వివరించారు.
భారత్, పాకిస్థాన్ కాల్పుల విరమణలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్ర లేదని ప్రధాని ధైర్యంగా చెప్పాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సవాల్ విసిరా...