Pahalgam attack : పాకిస్తానీలు ఇక ఇక్కడ ఉండొద్దు ..
Pahalgam attack : జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)లోని పహల్గాం వద్ద జరిగిన ఘోర ఉగ్రదాడి (Pahalgam terror attack) పెను విషాదాన్ని మిగిల్చింది. పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. దీనికి బాధ్యతను పాకిస్తాన్‌కి చెందిన ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా కు చెందిన షాడో గ్రూప్ అయిన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (TRF)' స్వయంగా తీసుకోవడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్‌పై పలు ఆంక్షలను విధించింది.
Pahalgam attack : పాకిస్తాన్ రాయబారికి నోటీసు
ఢిల్లీలో ఉంటున్న పాకిస్తాన్ ఉన్నత స్థాయి రాయబారి సాద్ అహ్మద్ వర్రైచ్ (Saad Ahmad Warraich)కు భారత విదేశాంగ మంత్రిత్వశాఖ 'Persona Non Grata' అనే అధికారిక నోటీసును జారీ చేసింది. ఈ చర్య ద్వారా పాక్ రాయబారితో పాటు ఆయన సైనిక, నౌకా, వైమానిక దౌత్యాధికారులను అప్రతిష్ఠితులుగ...




