Parliament erupts | పార్లమెంట్ ప్రాంగణంలో హైడ్రామా .. ఎన్డీఏ, విపక్షాలు మధ్య రగడ
Parliament erupts | విపక్షాలు (INDIA), ఎన్డీఏ (NDA) ఎంపీల మధ్య పార్లమెంట్ ప్రాంగణంలో ఈ రోజు ఘర్షణ జరిగింది. తోపులాట, పెనుగులాటలతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి గాయపడ్డారు. దీంతో ఆయన్ను ఆ పార్టీ నేతలు ఆస్పత్రికి తరలించారు. సారంగిని రాహుల్ గాంధీ (Rahul Gandhi) తోసేసారని, దీంతో ఆయన కిందపడిపోయి గాయపడ్డారని బీజేపీ ఆరోపిస్తోంది.
ఆరోపణలు.. ప్రత్యారోపణలు
అంబేడ్కర్ అంశంపై పార్లమెంటు సాక్షిగా నిరసనలు జరుగుతున్నాయి. అంబేద్కర్‌ను హోంమంత్రి అమిత్ షా అవమానించారని విపక్షాలు ఆరోపిస్తూ పార్లమెంట్ లోపల, వెలుపల నిరసనలు చేపడుతున్నాయి. ఇదే క్రమంలోనే ఈ రోజు సేషన్ ప్రారంభానికి ముందుకు పార్లమెంటు ప్రాంగణంలో ప్రతిపక్షాలు, బీజేపీ ఎంపీల మధ్య గొడవ జరిగింది. తోపులాటలు, పెనుగులాటలతో ఆ ప్రాంగణం హోరెత్తింది. తాను పార్లమెంట్ హౌస్‌లో ...