PrayagRaj : మహా కుంభామేళా.. లక్షల కొలువుల జాతర
PrayagRaj : ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభామేళా (Maha Kumbh 2025) ఆధ్యాత్మికంగానే కాకుండా ఉపాధి కల్పనకు దోహదం చేస్తోందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ఈ మహా కుంభామేళా అనేక ఉద్యోగాలను సృష్టించి నిరుద్యోగ నిర్మూలనకు బాటలు వేసిందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా పర్యాటక, రవాణా, లాజిస్టిక్స్, ఆరోగ్య సంరక్షణ, ఐటీఈ, రిటైల్ రంగాల్లో ఆయా వ్యాపార, వాణిజ్య సంస్థలకు గణనీయ లాభాలు తీసుకొచ్చి యువతరానికి ఉద్యోగావకాశాల కల్పనకు మార్గం సుగమం చేసిందని తేలింది.
తాత్కాలిక.. శాశ్వత అవకాశాలు
ఇప్పటికే మహా కుంభామేళా సందర్భంగా అనేక వ్యాపార, వాణిజ్య సంస్థల ద్వారా యువత తాత్కాలిక ఉద్యోగాలతో ఉపాధి పొందుతున్నారు. దీంతో ఆయా కంపెనీలు ఆర్థికంగా మరింత బలోపేతం కానున్న నేపథ్యంలో భవిష్యత్తులో శాశ్వత ప్రాతిపాదికన కూడా యువతకు ఉద్యోగ...




