EVMs Role in Election Results | మహారాష్ట్ర ఎన్నికల్లో ఈవీఎం పాత్రపై క్లారిటీ
EVMs Role in Election Results : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ఈవీఎంలు ప్రభావితం చేశాయని ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్ పక్షపాత ధోరణిని అవలంబించిందని ఆరోపిస్తున్నాయి. పోలింగ్ అనంతరం ఫలితాలకు ముందు ఈవీఎం (EVM)లను మార్చారని, ఈ చర్య ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసిందని అంటోంది. అయితే... ఈ ఆరోపణల్లో నిజం లేదని తేటతెల్లం చేసింది ఎన్నికల కమిషన్. వీవీప్యాట్ల (VVPAT)లోని స్లిప్పులను, ఈవీఎంలో నమోదైన ఓట్లను పోల్చి చూపించింది. ఈ రెండింటి సంఖ్య సరిసమానంగా ఉండటంతో ఫలితాలను తారుమారు చేయడంలో ఈవీఎంల పాత్ర ఏమీ లేదని మరోసారి నిరూపించుకుంది.
నిజం కాదని నిరూపణ
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో ఈవీఎం పాత్ర, ఎన్నికల కమిషన్ పారదర్శకతా లోపంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఎన్నికల అదనపు ప్రధాన అధికారి కిరణ్ కులకర్ణి స్పం...