Amit Shah | అమిత్‌షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నిరసన
Amit Shah : రాజ్యాంగంపై రాజ్యసభలో కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిన వాగ్వాదం తీవ్ర వివాదానికి దారి తీసింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తన ప్రసంగంలో అంబేద్కర్ (Ambedkar)పై చేసిన వ్యఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్, దాని సహచర పార్టీల ఎంపీలు తప్పుపట్టారు. రాజ్యాంగ నిర్మాతపై అమిత్‌షా అనుచితంగా మాట్లాడారని, దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యలు అంబేద్కర్‌ను అవమానించడమేనని కాంగ్రెసు ఆరోపించింది. దీనిపై ఆయన క్షమాపణ చెప్పాలని, తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అమిత్‌షా చేసిన వ్యాఖ్యలు ఏమిటంటే..
రాజ్యాంగంపై రాజ్యసభ (Rajya sabha) లో చర్చ వాడీవేడిగా సాగుతోంది. ఈ క్రమంలోనే మంగళవారం సేషన్‌లో కాంగ్రెస్‌పై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పలు ఆరోపణలు చేశారు. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ ఒక కుటుంబ ప్రైవేట్ ఆస్తిగా భావించి, పార్లమెంట్‌ను మోసం చేస్తోందని వ్యాఖ్యాన...




