Bullet Train | భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు ఇవే..
Bullet Train | భారతదేశంలో మొట్టమొదటి బులెట్ ట్రైన్ పరుగులుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ హై-స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లులో ప్రయాణీకులకు హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.
ముంబై - అహ్మదాబాద్ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయి:
ముంబై
థానే
విరార్
బోయిసర్
వాపి
బిలిమోరా
సూరత్
బరూచ్
వడోదర
ఆనంద్
అహ్మదాబాద్
సబర్మతి
బులెట్ ట్రైన్ స్టేషన్లలో వెయిటింగ్ ఏరియాలలో విశాలమైన సీటింగ్, సులభంగా స్పష్టంగా కనిపించే సైన్ బోర్డులు ఉంటాయి. అధిక నాణ్యత గల విశ్రాంతి గదులు, పిల్లల కోసం నర్సరీలు, సామాను లాకర్లు ప్రయాణీకుల అవసరాలను తీరుస్తాయి. ఫస్ట్-క్లాస్ ప్రయాణికులు బిజినెస్ లాంజ్‌లకు యాక్సెస్‌ను కలిగి ఉంటారు, ప్రయాణంలో విశ్రాంతిని పొందవచ్చు. స్టేషన్‌లలో వీల్...