Bill Clinton | బిల్ క్లింటన్‌కు అస్వస్థత..
Bill Clinton Hospitalised | అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. వాషింగ్టన్ డీసీలోని మెడ్‌స్టార్ జార్జ్‌టౌన్ యూనివర్శిటీ హాస్పిటల్ (MedStar Georgetown University Hospital in Washington, D.C.)లో చేర్చారు. ఈ విషయాన్ని ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఆంజెల్ యురీనా వెల్లడించారు. 'మాజీ అధ్యక్షుడు క్లింటన్ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారు. ఇప్పుడాయన బాగానే ఉన్నారు. క్రిస్మస్‌కు ముందే ఇంటికి తిరిగి వస్తారు' అన్నారు. ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని తెలిపారు. వైద్య బృందం అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు అవసరమైన చికిత్సను అందిస్తోందని పేర్కొన్నారు.
ఒక్కసారిగా కుప్పకూలిన Bill Clinton
వాషింగ్టన్‌లో తన నివాసంలో ఉన్నప్పుడు 78 ఏళ్ల క్లింటన్ (Former US President Bill Clinton) అస్వస్థతకు గురయ్యారు. ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఆయన...




