Farmers Protest Updates | నేడు రైతుల పాదయాత్ర.. ఢిల్లీలో టెన్షన్.. టెన్షన్..
                    Farmers Protest Updates :  రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ నేపథ్యంలో నగర సరిహద్దుల వద్ద ప్రభుత్వం బారీ భద్రతను పెంచింది. తమ డిమాండ్ల కోసం రైతులు నేటి మధ్యాహ్నం 1:00 గంటలకు శంభు సరిహద్దు నుండి ఢిల్లీ వైపు పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే..
న్యూఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ రైతుల నిరసనలు నేటికీ కొనసాగుతున్నాయి, అలాగే రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ ప్రకారం, 101 మంది రైతులతో కూడిన 'జాతా' ఈ రోజు మధ్యాహ్నం 1:00 గంటలకు శంభు సరిహద్దు నుంచి దేశ రాజధాని వైపు కదులుతుంది. . ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా అవసరమైన ప్రదేశాల్లో భద్రతను పెంచారు.
101 మంది రైతులతో 'మర్జీవ్దా జాతా' పేరుతో పాదయాత్ర శుక్రవారం మధ్యాహ్నం 1 గంటలకు శంభు సరిహద్దు నిరసన ప్రదేశం నుంచి ఢిల్లీకి మార్చ్‌గా బయలుదేరుతుందని రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ తెలిపారు. విలేకరుల సమావేశంలో రైతు నాయకుడు సర్వన్ సింగ్ ...                
                
             
								



