Covid 19 | దేశంలో కరోనా డేంజర్ బెల్స్
2,700 కోవిడ్ కేసులు.. ఏడు మరణాలు నమోదు
Covid 19 cases in india | దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. గత వారం రోజుల్లోనే కోవిడ్ పాజిటివ్ కేసులు ఐదు రెట్లు పెరిగాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,700 కోవిడ్ కేసులు (Covid 19 cases ) నమోదు కాగా , ఏడుగురు ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలుకోల్పోయినట్లు తెలిపింది.
ప్రధానంగా మూడు రాష్ట్రాల్లోనే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయి. కేరళ, మహారాష్ట్ర, దిల్లీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.. కేరళలో 1,147 పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో 424, దిల్లీలొ 294 కేసులు బయటపడ్డాయని అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని కేంద్రం ఆదేశించింది. మళ్లీ కొరోనా విపత్తు వస్తే..ఎదుర్కొనేందుకు కేంద్రం పూర్తి సిద్ధంగ...