ECI | నిషేధిత జాబితాలో మరిన్ని పార్టీలు.. తెలంగాణ నుంచి 9 పార్టీలు
- రెండోదశలో 476 పార్టీలను గుర్తించిన ఈసీ
న్యూదిల్లీ : చట్టబద్ధత, నిబంధనలు పాటించని రాజకీయ పార్టీలపై ఈసీ (ECI) కఠిన చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా మరో 476 పార్టీలను రద్దు చేసే దిశగా చర్యలను మొదలు పెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇటీవల 334 పార్టీలను రద్దు చేసిన ఈసీఐ.. తాజాగా రెండో రౌండ్‌లో మరో 476 పార్టీలను గుర్తించి.. వాటిపై వేటు వేసేందుకు ప్రక్రియను మొదలుపెట్టింది.
ఈసీ గుర్తించిన పార్టీల జాబితాలో ఏపీ నుంచి 17 పార్టీలు ఉండగా.. తెలంగాణ నుంచి 9 పార్టీలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్నికల వ్యవస్థను పటిష్టం చేసేందుకు చేపట్టిన సమగ్రమైన వ్యూహాల్లో భాగంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 2019 నుంచి ఆరేళ్లలో ఒక్క ఎన్నికల్లో కూడా పోటీ చేయని రాజకీయ పార్టీలను గుర్తించి, జాబితా నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టినట్లు వెల్లడిం...




