Operation Sindoor : ఆపరేషన్ సిందూర్ కొనసాగిస్తాం.. మాకు ఎవరి మధ్యవర్తిత్వం వద్దు..
Operation Sindoor : భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత కూడా, ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ దుస్సాహసానికి తగిన విధంగా స్పందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సాయుధ దళాలను ఆదేశించారని తెలిపాయి.
"ఆపరేషన్ సిందూర్ ముగియలేదు, సీమాంతర ఉగ్రవాదంపై భారత్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై మే 7న దాడుల తర్వాత భారత్ వైఖరి పటిష్టంగా ఉంది. పాకిస్తాన్ కాల్పులు జరిపితే, భారత్ బాంబులు వేస్తుంది. పాకిస్తాన్ ఆగిపోతే, భారత్ ఆగిపోతుంది అని కూడా ఆ వర్గాలు తెలిపాయి.
న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌తో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ద్వారా మాత్రమే మాట్లాడుతుంది, చర్చించడానికి వేరే అంశం లేదని ఆ వర్గాలు చెబుతున్నాయి. "సింధూ జలాల ఒప్పందం సీమాంతర ఉగ్రవాదానికి సంబ...