Bharat Bandh : నేడు భారత్ బంద్.. సమ్మెలో 25 కోట్ల మంది కార్మికులు?
బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు, తపాలా, నిర్మాణ రంగాల్లో సేవలకు అంతరాయం
Bharat Bandh LIVE updates : దేశవ్యాప్తంగా బుధవారం (జూలై 9) 'భారత్ బంద్'కు పిలుపునిచ్చాయి. దీనికి దాదాపు 10 కేంద్ర కార్మిక సంఘాల కూటమి, అనేక రైతు సంఘాలు మద్దతు ఇచ్చాయి. కేంద్రం అనుసరిస్తున్న "కార్పొరేట్ అనుకూల" విధానాలను నిరసిస్తూ పలు సంఘాలు ఈ సమ్మెను నిర్వహిస్తున్నాయి. బ్యాంకింగ్, బీమా, బొగ్గు గనులు, తపాలా, నిర్మాణ రంగాల వంటి పబ్లిక్ సర్వీస్ విభాగాలకు చెందిన 25 కోట్ల మందికి పైగా కార్మికులు నేటి దేశవ్యాప్త సమ్మె (భారత్ బంద్)లో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న "కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్లకు అనుకూలమైన విధానాలు"పై నిరసనగా 10 కేంద్ర కార్మిక సంఘాలు ఈ బంద్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కి చెందిన అమర్ జీత్ కౌర్ మాట్లాడుతూ, “25 కోట్ల మంద...




