Operation Sindoor : యుద్ధం మొదలైంది.. పీవోకేలో ఉగ్ర శిబిరాలపై దాడులు
Operation Sindoor : భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ కింద పాకిస్తాన్ (Pakistan) లోపలి భాగంలో దాడులు చేసింది. పాకిస్తాన్‌లోని మొత్తం 9 ఉగ్రవాద స్థావరాలను భారతదేశం ధ్వంసం చేసింది. ఇందులో పీవోకే, పాకిస్తాన్ భాగాలు ఉన్నాయి.
india vs pakistan : పాకిస్తాన్‌లో దాడి ఎక్కడ జరిగింది?
భారత సైన్యం విజయవంతంగా లక్ష్యంగా చేసుకున్న తొమ్మిది ప్రదేశాలలో, నాలుగు పాకిస్తాన్‌లో ఐదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నాయి. పాకిస్థాన్‌లోని స్థావరాలలో బహవల్‌పూర్, మురిద్కే, సియాల్‌కోట్ ఉన్నాయి. ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకోవడానికి ప్రత్యేక ప్రెసిషన్ ఆయుధాలను ఉపయోగించారు. మూడు దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి.
Operation Sindoor : అన్ని దాడులు విజయవంతం
తొమ్మిది ప్రదేశాలపై దాడులు విజయవంతమయ్యాయని వర్గాలు తెలిపాయి. భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్న జైషే మొహమ్మద్ (జెఎం), లష్కరే తోయిబా (ఎ...