Paddy Scam | మిల్లుల్లో ‘నిల్’.. రికార్డుల్లో ‘ఫుల్’..
హరిహర, శ్రీలక్ష్మీ సాయి మిల్లుల్లో ధాన్యం మాయం!
Warangal Rice Mill Paddy Scam | ప్రభుత్వ రికార్డుల్లో చూస్తే వేల క్వింటాళ్ల ధాన్యంతో ఆ మిల్లులు కళకళలాడుతున్నాయి. కానీ క్షేత్రస్థాయిలో అడుగుపెడితే అక్కడ ఖాళీ గదులు దర్శనమిస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపం, మిల్లు యజమానుల కాసుల కక్కుర్తి వెరసి ప్రభుత్వ సొమ్ము పక్కదారి పడుతోంది. వరంగల్ జిల్లాలోని హరిహర ఇండస్ట్రీస్, శ్రీలక్ష్మీ సాయి బిన్నీ రైస్ మిల్లుల్లో జరుగుతున్న అక్రమాలు ఇప్పుడు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
నిబంధనలు బేఖాతరు.. ఇష్టారాజ్యం!
కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కింద ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని నిబంధనల ప్రకారం మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. అయితే, ఈ రెండు మిల్లుల యజమానులు నిబంధనలను తుంగలో తొక్కారు. కోట్ల రూపాయల విలువైన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకున్నట్లు తీవ్ర ఆ...




