Sarkar Live

Special Stories

Special Stories

Rice Mill Scam | ‘అరవింద’ రైస్ మిల్లులో భారీ గోల్‌మాల్!
Special Stories

Rice Mill Scam | ‘అరవింద’ రైస్ మిల్లులో భారీ గోల్‌మాల్!

వేల క్వింటాళ్ల సర్కారు ధాన్యం మాయం! ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తే అధికారులు విస్తుపోవాల్సిందే Narsampet Rice Mill Scam | వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ప్రముఖ రైస్ మిల్లు 'అరవింద' ఇప్పుడు తీవ్ర ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుంది. ప్రభుత్వం నుంచి కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం సేకరించిన వేల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు మిల్లులో కనిపించకపోవడం (Rice mill Paddy Missing) స్థానికంగా కలకలం రేపుతోంది. రికార్డులకు, మిల్లులోని అసలు నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో 'ధాన్యం ఆవిరైందా? లేక అమ్మేశారా?' అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. Rice Mill Scam : అసలేం జరిగింది? ప్రభుత్వం ప్రతి ఏటా రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, తిరిగి పౌరసరఫరాల శాఖకు (CMR రూపంలో) అప్పగించే బాధ్యతను రైస్ మిల్లులకు అప్పగిస్తుంది.2025-26 ఖరీఫ్ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి 2567 మెట్రిక్ టన్నుల ధాన్యాన్...
Land Encroachment | సర్కారు దారినే మింగేసి వెంచర్..
Special Stories

Land Encroachment | సర్కారు దారినే మింగేసి వెంచర్..

పైడిపల్లి రెవెన్యూ శివారు సర్వే నెంబర్ 704 లోని రోడ్డునే మింగేసిన రియల్ మాఫియా.. రెవెన్యూ, మున్సిపల్ అధికారుల కళ్ళు 'మూయించారా'..? ఎన్.ఎస్.ఆర్ హాస్పిటల్ - కొత్తపేట మార్గంలో 10 ఎకరాల్లో 81 ప్లాట్ల తో వెంచర్ Warangal Paidipalli Land Encroachment రియల్ ఎస్టేట్ మాఫియా ఆకలికి హద్దు అదుపు లేకుండా పోతోంది. భూమి కనిపిస్తే చాలు ‘నాది’ అని బోర్డు పెట్టేసే అక్రమార్కులు, ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ దారినే మింగేస్తున్నారు. పైడిపల్లి రెవెన్యూ శివారులో వెలిసిన ఒక వెంచర్ నిర్వాహకుల బరితెగింపు ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. సర్వే నంబర్ 704లో ప్రభుత్వ రికార్డుల్లో ఉన్న రోడ్డును సైతం ప్లాట్లుగా మార్చి అమ్మేస్తున్నా, అటు రెవెన్యూ.. ఇటు మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మతలబు ఏమిటనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్.ఎస్.ఆర్ హాస్పిటల్ - కొత్తపేట మార్గంలో భూదందా!...
సర్కారు ధాన్యం భద్రమేనా?
Special Stories

సర్కారు ధాన్యం భద్రమేనా?

రూ.2కోట్ల ధాన్యం మాయం పై అనుమానాలు Hanumakonda Paddy Scam | ఆ మిల్లులో ప్రభుత్వ ధాన్యం భద్రంగా ఉందా? అంటే అవునని చెప్పలేని పరిస్థితి నెలకొంది. హనుమకొండ జిల్లా అగ్రంపహాడ్ శివారులోని మహాదేవ ఇండస్ట్రీస్ వేదికగా సివిల్ సప్లైస్ ధాన్యం పక్కదారి పట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మిల్లులో ఉండాల్సిన ధాన్యంలో సుమారు రూ. 2 కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు విశ్వసనీయ సమాచారం. రికార్డుల్లో ఉన్న లెక్కలకు.. మిల్లులో ఉన్న నిల్వకు భారీ తేడా?  2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పౌరసరఫరాల శాఖ 2991.920 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR) కోసం ఈ మిల్లుకు పంపించింది. నిబంధనల ప్రకారం.. మిల్లర్ ఆ ధాన్యాన్ని మరాడించి 2004.586 మెట్రిక్ టన్నులు  అంటే 70 ఏసికెల బియ్యాన్ని ప్రభుత్వానికి  తిరిగి అప్పగించాలి. అయితే, ఇప్పటివరకు ఆ మిల్లర్ పౌరసరఫరాల శాఖకు కేవలం 12 ఏసికెల బియ్యాన్ని మాత్రమే ప...
NALA Conversion Scam | తహశీల్దార్ కన్వర్షన్ ల కహానీ
Special Stories

NALA Conversion Scam | తహశీల్దార్ కన్వర్షన్ ల కహానీ

వరంగల్ శివార్లలో 'నాలా' దందా: తహశీల్దార్ కన్వర్షన్ల కహానీ! ధరణి, భూభారతి లోపాలే పెట్టుబడిగా అక్రమాల పర్వం.. 40కి పైగా అక్రమ వెంచర్లకు క్లియరెన్స్. ప్రభుత్వ ఖజానాకు భారీ గండి. Warangal NALA Conversion Scam భూమి రికార్డుల ప్రక్షాళన కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి, భూభారతి పోర్టల్ లోని సాంకేతిక లోపాలు కొందరు అధికారులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) శివార్లలోని ఒక మండల తహశీల్దార్, నిబంధనలను తుంగలో తొక్కి రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుమారు 40కి పైగా అనధికారిక (Non-Layout) వెంచర్లలోని వందలాది ప్లాట్లకు నిబంధనలకు విరుద్ధంగా నాలా (NALA) కన్వర్షన్లు మంజూరు చేయడం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్రమ వెంచర్లకు 'నాలా' అండ సాధారణంగా ఏదైనా భూమిని వెంచర్‌గా మార్చాలంటే కుడ...
Bala Kishore Reddy | రాజకీయాల్లో ‘బాల కిషోర్ రెడ్డి’ ప్రభంజనం: ప్రజాసేవే లక్ష్యంగా.. యువతే సైన్యంగా సరికొత్త ప్రస్థానం!
Special Stories

Bala Kishore Reddy | రాజకీయాల్లో ‘బాల కిషోర్ రెడ్డి’ ప్రభంజనం: ప్రజాసేవే లక్ష్యంగా.. యువతే సైన్యంగా సరికొత్త ప్రస్థానం!

Bala Kishore Reddy Political Journey | రాజకీయాల్లో మార్పు రావాలంటే కేవలం పదవులు ఉంటే సరిపోదు.. ప్రజలతో మమేకమయ్యే మనసుండాలని నిరూపిస్తున్నారు యువనేత బాల కిషోర్ రెడ్డి (Bala Kishore Reddy) . సామాజిక సేవను కేవలం బాధ్యతగా కాకుండా, ఒక రాజకీయ శక్తిగా మలుచుకుంటూ ఆయన సాగిస్తున్న ప్రస్థానం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సేవే పునాదిగా.. ప్రజలే అజెండాగా! సాధారణంగా రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలోనే కనిపిస్తుంటారు. కానీ, బాల కిషోర్ రెడ్డి శైలి ఇందుకు భిన్నం. సామాజిక సేవను తన రాజకీయ ప్రస్థానానికి బలమైన పునాదిగా మార్చుకుంటున్నారు. ఇటీవల ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు, మహిళల సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు బాల కిషోర్ రెడ్డిని ఒక నాయకుడిగా ప్రజల్లో నిలబెడుతోంది. కొమ్మాల జాతరలో ప్రభా బండ...
error: Content is protected !!