Illegal Registrations | అడ్డూ అదుపు లేకుండా సబ్ రిజిస్ట్రార్ అక్రమాలు..
అక్రమంగా అనేక రిజిస్ట్రేషన్లకు పాల్పడిన చేసిన సబ్ రిజిస్ట్రార్
హన్మకొండ జిల్లాలో అక్రమ వెంచర్లలోని వందల కొద్దీ ప్లాట్లు రిజిస్ట్రేషన్
ఒక్కో ప్లాటుకు 30 నుంచి 50 వేలు ?
వివాదంలో ఉన్న వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా రిజిస్ట్రేషన్ చేసినందుకు 10 లకారాల పైనే తీసుకున్నట్లు ఆరోపణలు..?
సబ్ రిజిస్ట్రార్ చేసిన రిజిస్ట్రేషన్లపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అప్పటి జిల్లా రిజిస్ట్రార్ ను ఆదేశించిన ఉన్నతాధికారులు
ఆ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రేషన్లను జిల్లా రిజిస్ట్రార్ సైతం"మాములు"గా తీసుకున్నట్లు ప్రచారం..
Illegal Registrations | ఆ అధికారి తీరే వేరు, అక్రమార్కులకు కొమ్ముకాయడం, రియల్టర్ లతో అంటకాగడం , అక్రమాలను సక్రమంగా చేయడంలో ఈ సబ్ రిజిస్ట్రార్ "పీ హెచ్ డీ" చేసినట్లు స్టాంప్స్&రిజిస్ట్రేషన్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగులు కోడైకూస్తున్నారు. పత్రాలు లేని భూమిని రిజిస్ట్రేషన్ చేయడ...