ACB అధికారులకు తెలియాల్సిందే…
                    హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో లంచాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే…
హోదాను బట్టి లంచాలు… ప్రైవేట్ అసిస్టెంట్ లతో వసూళ్లు..
కార్యాలయంలో తీసుకుంటున్న లంచాలు చూస్తే ACB అధికారులు సైతం ఆశ్చర్యపోవాల్సిందే..
ACB | హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో ఆ అధికారులు తీసుకుంటున్న లంచాలను చూస్తే "ACB" అధికారులు సైతం ఆశ్చర్యపోతారని, లంచాల వివరాలు చూస్తే వారు షాక్ కు గురికాక తప్పదని వాహనదారులు అంటున్నారు. గత రెండు రోజులుగా "సర్కార్" వెబ్ సైట్ ప్రచురిస్తున్న వరుస కథనాలను గమనిస్తున్న వాహనదారులు.. హన్మకొండ ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై ఎవరికి వారే అవును ఇది నిజం నాకూ ఇలాగే జరిగింది.. నేను కూడా ఫలానా పనికి (సేవకు) కార్యాలయం వెలుపల ఉన్న అధికారుల ప్రైవేట్ అసిస్టెంట్ వద్ద లంచం ఇచ్చి పత్రాలపై కోడ్(చుక్క) ను వేపించుకుంటేనే పని అయింది అని చర్చించుకుంటున్నారు. ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిని ఎలాగైనా "అ...                
                
             
								



