Sarkar Live

Special Stories

Special Stories

Road Accidents | భారీ వాహనాలతో రోడ్లపై మరణ మృదంగం!
Special Stories

Road Accidents | భారీ వాహనాలతో రోడ్లపై మరణ మృదంగం!

ట్ర‌క్కులు, లారీల వ‌ల్ల‌ 2023లో 13,651 కంటే ఎక్కువ ప్రమాదాలు Telangana Road Accidents : ఇటీవ‌ల క‌ర్నూలులో బస్సు ద‌గ్ధ‌మై 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న మ‌రువక ముందే చేవెళ్లలో జరిగిన ఘోర ప్రమాదంలో 20 మంది మృత్యువాత ప‌డ్డారు. ఈ వ‌రుస‌ ప్రమాదాలు తెలంగాణ, ఏపీతోపాటు దేశ‌వ్యాప్తంగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. అనేక కుటుంబాలను సర్వనాశనం చేసిన చేవెళ్ల‌ సంఘటన అంద‌రినీ షాక్‌కు గురిచేసింది. చాలా వ‌ర‌కు ప్ర‌మాదాల్లో భారీ వాహనాల కార‌ణంగానే చోటుచేస‌కుంటున్నాయి ఈ విష‌యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. 2023లో 13,651 కంటే ఎక్కువ ప్రమాదాలకు ట్రక్కులు, లారీలు కారణమయ్యాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) జాతీయ డేటా చూపిస్తుంది. 2023లో మొత్తం మరణాలలో ట్రక్కులు, లారీల వల్ల జరిగిన ప్రమాదాలు 5.8 శాతంగా ఉన్నాయి. ఈ ప్రమాదాల బారిన పడిన వారిలో...
Paddy Scam | ధాన్యమేది మల్లిఖార్జునా…!
Special Stories

Paddy Scam | ధాన్యమేది మల్లిఖార్జునా…!

సుమారు 4 కోట్ల విలువైన ధాన్యం ఎటుపోయినట్లు? మాయం చేసారా? రికార్డుల్లో చూపించారా? Paddy Scam in Hanumakonda | సుమారు 4 కోట్ల విలువైన ధాన్యం ఆ మిల్లులో ఎందుకు కనిపించట్లేదు.నిజంగా ఆ మిల్లు యాజమాన్యం రికార్డుల్లో ఉన్నట్లుగా అంత ధాన్యం దింపుకుందా ?ఒకవేళ ఆ మిల్లుకు అంత ధాన్యం వస్తే సదరు మిల్లులో ఎందుకు లేదు? అసలు ధాన్యం మిల్లులోకి వచ్చిందా?లేదంటే మిల్లులోకి రాకున్నా రికార్డుల్లో చూపించారా?అసలు ఏంజరిగింది అని పౌరసరఫరాల శాఖ లొనే రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.ఇదిలా ఉంటే ఇటీవలే హన్మకొండ జిల్లాలో సంచలనం సృష్టించిన "సాంబశివ" మిల్లు వ్యవహారంలో జరిగిన విధంగానే ఇక్కడ కూడా జరిగిందా ?అనే అనుమానాలు వ్యక్తమవుతుండడం గమనార్హం. Paddy Scam : మాయమైందా? రికార్డుల్లో చూపించారా? హన్మకొండ జిల్లా పోచారం గ్రామంలో ఉన్న మల్లిఖార్జున స్వామి రైస్ మిల్లుకు 2024-25రబీ సీజన్ లో పౌర...
Hanamkonda | ‘వినాయకా’.. ధాన్యం ఎక్కడా?
Special Stories

Hanamkonda | ‘వినాయకా’.. ధాన్యం ఎక్కడా?

కోట్లు విలువ చేసే ధాన్యం మాయం చేసిన మిల్లు యాజమాన్యం? రబీ సీజన్లో ప్రభుత్వం కేటాయించిన ధాన్యం మాయం పై అనేక ఆరోపణలు పౌరసరఫరాల శాఖ అధికారులకు తెలుసా? తెలియదా ? Hanamkonda | ఆ మిల్లు యాజమాన్యం కోట్లు విలువ చేసే ధాన్యం మాయం చేసిందా?ప్రభుత్వం సదరు మిల్లుకు పంపిన ధాన్యం ఆ మిల్లులో ఎందుకు లేనట్లు?కేటాయించిన ధాన్యాన్ని మిల్లు యాజమాన్యం బహిరంగ మార్కెట్ కు తరలించిందా?లేక అసలు ఆ మిల్లుకు పూర్తిస్థాయిలో ధాన్యమే రాలేదా?అనే ప్రశ్నలు ఇప్పుడు పౌరసరఫరాల శాఖలో చక్కర్లు కొడుతున్నాయి.హన్మకొండ జిల్లా (Hanamkonda District) గట్లకానిపర్తిలో ఉన్న వినాయక మిల్లుకు ప్రభుత్వం 2024-25 రబీ సీజన్ లో 3225.080 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మరాడించేందుకు పంపించింది. సదరు మిల్లు యాజమాన్యం ఆ ధాన్యాన్ని మరాడించి 2160 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ రూపంలో పౌరసరఫరాల శాఖ కు అప్పగించాల్సి ఉండగా ఇప్పటివరకు నామమాత్రంగానే ...
Congress | కొండా Vs పొంగులేటి – ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ మంత్రుల పంచాయితీ
Special Stories

Congress | కొండా Vs పొంగులేటి – ఢిల్లీకి చేరిన కాంగ్రెస్ మంత్రుల పంచాయితీ

హైదరాబాద్‌: కాంగ్రెస్​ పార్టీ (Congress Party) లో కొద్దిరోజుల క్రితం మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌ మధ్య వివాదం మరువక ముందే.. కాంగ్రెస్ మంత్రుల మ‌ధ్య మరో పంచాయితీ మొదలైంది. వ‌రంగ‌ల్‌లోని మేడారం జాత‌ర‌ అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్‌ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) కి అలాగే ఆ శాఖ మంత్రి అయిన కొండా సురేఖ‌ (Konda Surekha)కు మధ్య విభేదాలు ముదిరి పాకాన ప‌డ్డాయి. మంత్రి పొంగులేటిపై మంత్రి కొండా సురేఖ ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డికి, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. వరంగల్‌ రాజకీయాలతోపాటు దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి అన‌వ‌స‌రంగా జోక్యం చేసుకుంటు న్నార‌ని కొండా దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు.అయితే ఈ వ్యవహారంపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదు చేశారు. పొం...
RTA : ఆర్టీఏలో “సాయి” లీలలు
Special Stories

RTA : ఆర్టీఏలో “సాయి” లీలలు

క్లోజ్ ఫైల్స్ భద్రమేనా? సీనియర్ అసిస్టెంట్ అప్రూవ్ చేసిన ఫైల్స్ ను విజిలెన్స్ విచారిస్తే విస్తుపోవాల్సిందే? లంచాల లావాదేవీలు "ప్రశాంతంగా" జరిగేందుకు ప్రైవేట్ వ్యక్తిని నియమించుకున్నట్లు ఆరోపణలు ? Bhupalapalli RTA : రవాణా శాఖలో "సాయి" లీలలు మామూలుగా ఉండటంలేదట, కారుణ్య నియామకంతో విధుల్లో చేరిన సదరు ఉద్యోగి అనతికాలంలోనే ఆర్టీఏ (RTA ) లో కాస్ట్లీ ఉద్యోగిగా మారినట్లు ఆరోపణలు జోరుగా వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న సదరు ఈ సీనియర్ అసిస్టెంట్ ఆర్టీఏ నిబంధనలను భేఖాతరు చేస్తూ అనేక ఫైళ్లను అప్రూవ్ చేసినట్లు తెలుస్తోంది. వరంగల్ కార్యాలయం లో విధులు నిర్వహించిన సదరు ఉద్యోగి బదిలీపై ఆ జిల్లా కార్యాలయానికి వెళ్లడంతోనే అనేక అక్రమాలకు పాల్పడినట్లు అందినకాడికి దండుకున్నట్లు సమాచారం. ప్రతి పనికి ఓ రేటు తీసుకునే సదరు సీనియర్ అసిస్టెంట్ తన లంచాల లావాదేవీలు "ప...
error: Content is protected !!