Check Post : మంత్రులుంటే మాకేంటి..?
అశ్వరావుపేట చెక్ పోస్టులో యథేచ్ఛగా వసూళ్లు
చెక్ పోస్ట్ దాటాలంటే మామూళ్లు సమర్పించాల్సిందే..
ఏసీబీ రైడ్ లు జరిగినా ఆగని మామూళ్ల దందా…?
Ashwarao pet Check Post : మంత్రులుంటే మాకేంటి…?మా లెక్క మాకొచ్చిందా? లేదా..? ఏ వాహనం అయినా సరే మేము డిసైడ్ చేసిన మామూళ్లు సమర్పించాల్సిందే. ఏమన్నా అయితే మా ఉన్నతాధికారులు చూసుకుంటారనే రీతిలో ఆ చెక్ పోస్టులో విధులు నిర్వహిస్తున్న మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ లు వాహనదారుల నుండి యథేచ్ఛగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఉమ్మడి జిల్లాకు లేని ప్రాధాన్యత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు దక్కిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ప్రభుత్వంలో హేమాహేమీలుగా పేరుగాంచిన ముగ్గురు మంత్రులు అనగా మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లు ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నప్పటికీ అశ్వరావుపేట చెక్ పో...




