Sarkar Live

Special Stories

Special Stories

సాయిరాం.. 24 ఏసీకేలు పెండింగ్! సీఎంఆర్ కు రాంరాం.. చెప్పినట్లేనా? – Sairam Rice Mill CMR
Special Stories

సాయిరాం.. 24 ఏసీకేలు పెండింగ్! సీఎంఆర్ కు రాంరాం.. చెప్పినట్లేనా? – Sairam Rice Mill CMR

​Sarkar Live Exclusive | గత కొన్నిరోజుల క్రితం ​సీఎంఆర్ (CMR - కస్టమ్ మిల్లింగ్ రైస్ ) గడువు ముగిసింది. కానీ ప్రభుత్వం మళ్ళీ అవకాశం కల్పించి గడువును పెంచింది. అయినప్పటికీ కొంతమంది మిల్లర్ లు మాత్రం ప్రభుత్వానికి పెట్టాల్సిన సీఎంఆర్ ను మాత్రం పూర్తిచేయలేకపోతున్నారు. ముఖ్యంగా కొంతమంది మిల్లర్ లు ఇప్పటికే ధాన్యాన్ని బహిరంగ మార్కెట్ కు తరలించడంవల్లే సీఎంఆర్ పూర్తిచేయలేకపోతున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా వరంగల్ జిల్లా బొల్లికుంట రెవెన్యూ శివారులోని సాయిరాం రైస్ మిల్లు సీఎంఆర్ (Sairam Rice Mill CMR) వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.2025-26ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ మిల్లర్ ప్రభుత్వానికి 47 ఏసికేల సీఎంఆర్ పెట్టాల్సి ఉండగా, ఇప్పటివరకు 23 ఏసికేల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇంకా 24 ఏసికేల సీఎంఆర్ పెట్టాల్సి ఉండగా,అసలు 24 ఏసికే లకు సరిపడా ధాన్యం మిల్లులో ఉం...
కలెక్టర్ పట్టుదల.. రియల్టర్ల కుతంత్రాలు!
Special Stories

కలెక్టర్ పట్టుదల.. రియల్టర్ల కుతంత్రాలు!

కీర్తినగర్ హౌజింగ్ బోర్డు సర్వేను అడ్డుకునేందుకు 'విశ్వప్రయత్నాలు' Housing Board Land Survey | గీసుగొండ మండలంలోని కీర్తినగర్ (Keerthi nagar) హౌజింగ్ బోర్డు భూములు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూమిపై కన్నేసిన కొందరు రియల్టర్లు, దానిని చేజిక్కించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వ ఆస్తిని కాపాడాలని జిల్లా కలెక్టర్ కఠినంగా వ్యవహరిస్తుంటే, మరోవైపు రాజకీయ పలుకుబడితో సర్వేను అడ్డుకునేందుకు రియల్టర్లు 'విశ్వప్రయత్నాలు' చేస్తున్నారు. ​అధికారుల ఆదేశాలకు, రాజకీయ ఒత్తిళ్లకు మధ్య జరుగుతున్న ఈ పోరాటంలో గెలుపు ఎవరిది? సర్వే సజావుగా సాగుతుందా లేక రియల్టర్ల వ్యూహమే పారుతుందా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ​రాజకీయ ఒత్తిడితో పావులు.. ​హౌజింగ్ బోర్డుకు చెందిన ఖరీదైన భూమిలో హద్దులు నిర్ణయించేందుకు రెవెన్యూ యంత్రాంగం సిద్ధమవగా, ఒక ప్రముఖ రియల్టర్ దానిన...
సాయి క్రిష్ణ ధాన్యం లీలలు.. రికార్డుల్లో నిల్వ.. మిల్లులో ఖాళీ!
Special Stories

సాయి క్రిష్ణ ధాన్యం లీలలు.. రికార్డుల్లో నిల్వ.. మిల్లులో ఖాళీ!

పౌరసరఫరాల రికార్డులకు మిల్లులోని ధాన్యం నిల్వలకు భారీ తేడా? Sai Krishna Rice Mill Grain Scam | పౌరసరఫరాల శాఖ రికార్డుల్లో వందల క్వింటాళ్ల ధాన్యం నిల్వలు ఉన్నట్లు చూపిస్తున్నా, మిల్లులో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. హన్మకొండ జిల్లా నందనంలోని సాయి కృష్ణ రైస్ మిల్లుపై ఇప్పుడు అనేక ఆరోపణలు ముసురుకుంటున్నాయి. 2025-26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం లెక్కల్లో భారీ తేడాలు ఉన్నట్లు తెలుస్తోంది. ​రికార్డుల్లో ‘నిల్వ’… మిల్లులో ‘ఖాళీ’! ​పౌరసరఫరాల శాఖ రికార్డుల ప్రకారం మిల్లులో ఉండాల్సిన ధాన్యం నిల్వలకు, అక్కడ క్షేత్రస్థాయిలో ఉన్న నిల్వలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 15 ఏసికేలు (ACKs) ఇప్పటికీ పెండింగ్‌లో ఉండటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ధాన్యం నిల్వలు మిల్లుకు రాకుండానే రికార్డులు సృష్టించారా? లేదా మిల్లుకు వచ్చిన ధాన్యాన్ని అక్రమ మార్గాల...
కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములకు ‘గ్రహణం’.. కలెక్టర్ ఆదేశించినా కదలని సర్వే! – Housing Board Lands
Special Stories

కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములకు ‘గ్రహణం’.. కలెక్టర్ ఆదేశించినా కదలని సర్వే! – Housing Board Lands

Keerthinagar Housing Board Lands | ​వరంగల్ నగరంలోని కీర్తినగర్ హౌజింగ్ బోర్డు భూములు ఇప్పుడు ఆక్రమణదారుల గుప్పిట్లోకి వెళ్తున్నాయి. కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ సత్య శారద స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం "అడవిలో వెన్నెల" చందంగా మారింది. సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ విభాగం, హౌజింగ్ బోర్డు అధికారుల మధ్య సమన్వయ లోపం ఆక్రమణదారులకు వరంగా మారుతోంది.హౌజింగ్ బోర్డు భూముల అన్యాక్రాంతం పై "సర్కార్ లైవ్ "వరుస కథనాలకు స్పందించిన కలెక్టర్ తక్షణమే సర్వే పూర్తి చేసి హౌజింగ్ బోర్డు భూములకు హద్దులు నిర్ణయించాలని ఆదేశించగా సదరు భూములపై సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి ఈ నెల 13 వ తేదీన సర్వే పేరుతో హడావుడి చేసి చేతులు దులుపుకొన్నారు ​వివాదానికి ప్రధాన కారణాలు ​రికార్డుల సాకు: భూ సేకరణకు సంబంధించిన పూర్తి రికార్డులు ఇస్తే...
తెలంగాణలో సెగలు పుట్టిస్తున్న ఎండలు: మే, జూన్ నెలల్లో నిప్పుల కొలిమే! ‌‌‌‌– Heatwave
Special Stories

తెలంగాణలో సెగలు పుట్టిస్తున్న ఎండలు: మే, జూన్ నెలల్లో నిప్పుల కొలిమే! ‌‌‌‌– Heatwave

Telangana Heatwave Alert | తెలంగాణలో రోజురోజుకీ ఉష్ణోగ్రతలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఏప్రిల్ మొదటి వారంలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం సాధారణం కంటే 3 డిగ్రీల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, మున్ముందు ఈ తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై, వడదెబ్బ బాధితుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఎల్ నినో ఎఫెక్ట్: ఎందుకీ తీవ్రత? పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణోగ్రతలు 0.5 నుంచి 1 డిగ్రీ వరకు పెరగడంతో 'ఎల్ నినో' పరిస్థితులు నెలకొన్నాయి. దీని ప్రభావం దక్షిణ భారతదేశంపై తీవ్రంగా ఉండనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రుతుపవనాలపై ప్రభావం: ఎల్ నినో కారణంగా నైరుతి రుతుపవనాలు బలహీనపడే అవకాశం ఉంది, దీనివల్ల వర్షపాతం తగ్గి వేసవి కాలం సుదీర్ఘంగా కొనసాగవచ్చు. ముంచుకొస్తున్న ముప్పు: రానున్న మే, జ...
error: Content is protected !!