Cyclone Montha | మొంథా తుపాన్ ఎఫెక్ట్.. అధికారులకు సీఎం రేవంత్ అత్యవసర ఆదేశాలు
                    Hyderabad | మొంథా తూపాన్ (Cyclone Montha) తీవ్ర వాయుగుండంగా మారి దక్షిణ భారతదేశంలో కుంభవృష్టి కురిపిస్తోంది. తెలంగాణలో కూడా తుఫాను ప్రభావం పెరుగుతోందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం దాటిన మొంథా తుఫాన్ భద్రాద్రి కొత్తగూడం మార్గంగా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా బుధవారం ఉదయం నుంచే భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) రాష్ట్ర అధికారులకు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్ (Warangal) , నల్గొండ జిల్లాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడి కలెక్టర్లు, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సమన్వయంతో నిరంతరం పర్యవేక్షించాలని చెప్ఆపరు.సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి, వర్షాల ప్రభావం, నష్టాలపై అత్యవసరంగా చేపట్టాల్సిన పనులపైసమీ...                
                
             
								



