పంటనష్ట పరిహారం నిధుల విడుదల – Crop Loss Compensation
Crop Loss Compensation | రాష్ట్రంలో గత రెండు నెలలుగా పలుధఫాలుగా వడగళ్ల వానలు, అకాలవర్షాలకు పంట నష్టం సంభవించగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలమేరకు వ్యవసాయ శాఖ రైతుల వారీగా పంటనష్టం అంచనవేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆ నష్ట పరిహారాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేసేందుకు వీలుగా సర్వేకు ఆదేశాలివ్వగా నివేదికలు ప్రభుత్వానికి సమర్పించింది. దాదాపు 29 జిల్లాల్లో 41,361 మంది రైతులకు సంబంధించి 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించిన 51.528 కోట్లు నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల ఎకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను వ్యవసాయశాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు. డమైనది.
రాష్ట్రవ్యాప్తం...




