Sarkar Live

Hyderabad

తుదిదశకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ భూసేకరణ, కొనసాగుతున్న కూల్చివేతలు ‌‌– Old City metro corridor
Hyderabad

తుదిదశకు హైదరాబాద్ ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ భూసేకరణ, కొనసాగుతున్న కూల్చివేతలు ‌‌– Old City metro corridor

Hyderabad Metro news : 7.5 కి.మీ ఓల్డ్ సిటీ మెట్రో రైల్ కారిడార్ (Old City metro corridor) వెంబడి భూసేకరణ, కూల్చివేత పనులు కీలక దశకు చేరుకున్నాయి. అవసరమైన రైట్ ఆఫ్ వే (RoW) క్రమంగా అందుబాటులోకి వస్తోంది. ఇప్పటివరకు మొత్తం 886 ఆస్తుల్లో 550 కంటే ఎక్కువ కూల్చివేశారు. మిగతా నిర్మాణాల తొలగింపు పనులు సైతం జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఆస్తి యజమానులకు ప్రభుత్వం రూ.433 కోట్ల పరిహారం చెల్లించింది. వర్షాలు, పండుగలు, మొహర్రం ఊరేగింపులు వంటి సవాళ్ల మధ్య కూడా పనులు పెద్దగా ఇబ్బంది కలగకుండా సజావుగా జరిగాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) అధికారులు తెలిపారు. భూగర్భ విద్యుత్ కేబుల్ మార్పిడి మొదట అడ్డంకిగా మారినా ఇప్పుడు సమస్యలు పరిష్కరించబడ్డాయి. మెట్రో పిల్లర్లు, స్టేషన్ నిర్మాణానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. ఖచ్చితమైన మ్యాపింగ్ కోసం డిఫరెన్షియల్ GPS (DGPS) సర్వేలు నిర్వహిస్తున్నారు....
Harish Rao : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోరా?
State, Hyderabad

Harish Rao : పిల్ల‌ల ప్రాణాలు పోతున్నా ప‌ట్టించుకోరా?

సీఎం రేవంత్‌ రెడ్డిని నిలదీసిన హరీశ్‌రావు Hyderabad : విష జ్వరాలు, పాము కాట్లు, ఎలుక కాట్లు, కుక్క కాట్లు, ఫుడ్ పాయిజనింగ్‌తో విద్యార్థులు ఆస్పత్రుల పాలవున్నా ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్లైనా లేద‌ని కాంగ్రెస్ పాలనలో గురుకుల విద్యావ్యవస్థ దీనస్థితికి చేరాయ‌ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు (Harish Rao) విమర్శించారు. గురుకులాల్లో 2,500 మంది కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలలుగా జీతాలు చెల్లించ‌నిదుస్థితి నెల‌కొంద‌ని హరీశ్‌రావు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం నాడు ఆడంబరంగా ప్రకటనలు చేయడం కాదు ముందు వారికి సకాలంలో జీతాలు చెల్లించాల‌ని సీఎం రేవంత్‌ రెడ్డిని డిమాండ్‌ చేశారు. సీఎం రేవంత్ స్వయంగా తానే ఇకపై గురుకులాలను పర్యవేక్షిస్తానని చెప్పిన మాటలు ఉత్త‌మాట‌ల‌య్యాయ‌ని విమర్శించారు. కల్తీ ఆహారం పెడితే జైలుకే అని ఇచ్చిన ప్రకటనలు చేశార‌ని కానీ, అవి గాలి మాటలయ్...
Hyderabad : 48 గంటలు హై అలెర్ట్..  హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం
Hyderabad

Hyderabad : 48 గంటలు హై అలెర్ట్.. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనానికి అంతా సిద్ధం

Hyderabad Ganesh immersion 2025 : గణేష్ నిమజ్జన మహోత్సవం కోసం గ్రేటర్ హైదరాబాద్‌లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జీహెచ్ఎంసీ, పోలీస్, రెవెన్యూ, జలమండలి, ఎలక్ట్రిసిటీ, HMDA, పర్యాటక శాఖలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. నిమజ్జనం కోసం కీలక ఏర్పాట్లు 72 కృత్రిమ కొలనులు, 20 ప్రధాన సరస్సుల్లో నిమజ్జన సౌకర్యం 134 స్థిర క్రేన్‌లు, 259 మొబైల్ క్రేన్‌లు సిద్ధంగా హుస్సేన్ సాగర్‌లో 20 క్రేన్‌లు, బాహుబలి క్రేన్ ద్వారా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం 9 బోట్లు, DRF టీంలు, 200 ఈతగాళ్లు రెడీ 13 కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు హైదరాబాద్ పరిధిలో 303 కిలోమీటర్ల రోడ్డు మార్గంలో సజావుగా శోభాయాత్ర జరిగేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం 3 షిఫ్టులలో స్వచ్ఛత కార్యక్రమాలు 25 × 7 గంటలు విధుల్లో 15 వేలకు పైగా శానిటేషన్ సిబ్బందిని నియమించారు. రోడ్డు సేఫ్టీ డ్రైవ్ లో భాగంగా ఊర...
Kavitha |  హరీష్ రావు టార్గెట్‌గా కవిత ఫైర్
State, Hyderabad

Kavitha | హరీష్ రావు టార్గెట్‌గా కవిత ఫైర్

రేవంత్ రెడ్డి కాళ్లు హరీష్ రావు పట్టుకోగానే కుట్రలు మొదలయ్యాయి.. “ఎన్నో పుణ్యాల వల్లే కేసీఆర్ కూతురిగా పుట్టా” – కవిత భావోద్వేగం Kavitha press meet highlights : బీఆర్ఎస్ (BRS) పార్టీలోని కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌ను ఉద్దేశించి ఆమె సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో కవిత (Kavitha) బుధ‌వారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈసంద‌ర్భంగా ఆమె హ‌రీష్ రావుపై ఫైర్ అయ్యారు. హరీష్ రావు, రేవంత్ ఒకే ఫ్లైట్ లో ఏరోజైతే ఒకే విమానంలో ప్రయాణించారో ఆ రోజు నుంచే తమ కుటుంబం విడిపోవ‌డానికి కుట్రలు ప్రారంభ‌మ‌య్యాయ‌య‌ని అన్నారు. త‌న‌పై అక్రమ కేసులు పెట్టి తీహార్ జైల్లో ఐదున్నర నెలలు ఉంచారని, జైలు నుంచి బయటకు రాగానే.. 2024, నవంబర్ 23 నుంచి జ‌నంలోకి వ‌చ్చి పార్టీ త‌ర‌పున అనేక కార్యక్...
బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్..
State, Hyderabad

బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్..

భారత రాష్ట్ర సమితి పార్టీ ఎమ్మెల్సీ కవితను (MLC Kavitha) బహిష్కరించింది. ఈ మేరకు బీఆర్ఎస్ హై కమాండ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా గత కొంత కాలంగా బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కవిత విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే BRS పార్టీ చర్యలకు ఉపక్రమించింది. బీఆర్ఎస్ బీజేపీలో కలవబోతుందని ఆమె షాకింగ్ కామెంట్స్ చేశారు. కవిత గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు సైతం విమర్శించారు. . కవిత ప్రస్తుతం తెలంగాణ జాగృతి తరఫున కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు కవిత ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కఠంగా ఎదురుచూస్తున్నారు....
error: Content is protected !!