Sarkar Live

Hyderabad

Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ధరల వివరాలు ఇవే..
Hyderabad, State

Hyderabad Metro | మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరిగిన ధరల వివరాలు ఇవే..

Hyderabad Metro Fare Revision : మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు ఎల్ అండ్ టీ (L&T) సంస్థ షాకిచ్చింది.ఫేర్ ఫిక్సేషన్ కమిటీ (FFC) సిఫార్సులను అనుసరించి హైదరాబాద్ మెట్రో రైలు (Metro Rail) సవరించిన ఛార్జీలను మే 17, 2025 నుండి అమల్లోకి తీసుకొస్తోంది. మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ & నిర్వహణ) చట్టం, 2002లోని సెక్షన్ 34 కింద ఏర్పడిన ఈ కమిటీ జనవరి 25, 2023న తన నివేదికను సమర్పించింది. తాజాగా సవరించిన ఛార్జీ (Fare Revision)లను సంస్థ ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేయడానికి అమలు చేస్తున్నారు. కొత్త ఛార్జీలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. Hyderabad Metro : తక్కువ దూరాలకు చార్జీలు 2 కి.మీ వరకు దూరాలకు ఛార్జీ రూ.122 కి.మీ నుంచి ఎక్కువ, 4 కి.మీ వరకు రూ.18;4 కి.మీ నుంచి 6 కి.మీ వరకు ఛార్జీ రూ.306 కి.మీ నుంచి 9 కి.మీ వరకు,ఛార్జీ రూ.409 కి.మీ కంటే ఎక్కువ 12 కి.మీ వరకు ఛార్జీ రూ.50 ఎక్కువ దూరాలకు ధ...
Bhu bharathi | జూన్ 2 నుంచి భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు
State, Hyderabad

Bhu bharathi | జూన్ 2 నుంచి భూభార‌తి రెవెన్యూ స‌ద‌స్సులు

Bhu bharathi | తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ దినోత్స‌వమైన‌ జూన్ 2 నుంచి భూభార‌తి చ‌ట్టం (Bhu bharathi) లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి తెలిపారు. గ‌త నెల 14న భూభార‌తి చ‌ట్టాన్ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల‌మీదుగా ప్రారంభించుకున్నామని, అదేనెల 17 నుంచి 30 వ‌ర‌కు నాలుగు జిల్లాల్లోని నాలుగు మండ‌లాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా రెవెన్యూ స‌ద‌స్సులు (Revenue seminars) నిర్వ‌హించామని తెలిపారు. ఈ నెల 5వ తేదీ నుంచి 30వ తేదీ వ‌ర‌కు 28 జిల్లాల్లోని 28 మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు కొనసాగుతున్నాయని మంత్రి పొంగులేటి తెలిపారు. ఆయా మండలాల్లో ఎదురైన అనుభ‌వాల‌ను దృష్టిలో ఉంచుకొని జూన్ 2వ తేదీ నుంచి అన్ని మండ‌లాల్లో రెవెన్యూ స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్లడించారు. ...
LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరోసారి పొడిగింపు
State, Hyderabad

LRS Concession | ఎల్‌ఆర్‌ఎస్‌ రాయితీ గడువు మరోసారి పొడిగింపు

LRS Concession | లేఅవుట్‌ రెగ్యులరైజేషన్‌ సీమ్‌ (LRS) ఫీజుపై ఇస్తున్న 25 శాతం రాయితీ గడువును రాష్ట్ర స‌ర్కారు మ‌రోసారి పొడిగించింది. ఈనెల 3వ తేదీతో ముగిసిన గడువును మే 31 వరకు పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వన్‌ టైమ్‌ సెటిల్మెంట్‌ ప్రకటించిన ప్రభుత్వం.. ఎల్‌ఆర్‌ఎస్‌పై రాయితీ గడువును తొలుత మార్చి 31 వరకు గడువు ఇచ్చింది. ఆ తర్వాత దీనిని ఏప్రిల్‌ 30 వరకు, ఆ తర్వాత మే 3 వరకు పొడిగించింది. అయితే ఇప్పుడు మరోసారి మే 31వర‌కు రాయితీ అవ‌కాశం క‌ల్పించింది. కాగా ఎల్ఆర్ ఎస్ రాయితీ (LRS concession) పొడిగింపునకు ప‌లు కార‌ణాలు చెబుతున్నారు. సాంకేతిక సమస్యలు తలెత్తడం, ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో రాయితీ గడువును ప‌లుమార్లు పొడిగిస్తున్నట్టు ప‌లువురు పేర్కొంటున్నారు. 2020లో ప్రారంభమైన లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం కింద 25.67 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించ...
Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం
State, Hyderabad

Miss World 2025: మిస్‌ వరల్డ్‌-2025 పోటీలు ప్రారంభం

హైదరాబాద్ లో 72వ మిస్‌ వరల్డ్‌ పోటీలు (Miss World 2025) ఘనంగా ప్రారంభమయ్యాయి. 120కిపైగా దేశాలకు చెందిన అందాల రాశులు ప్రపంచ సుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. భారత్‌ తరఫున మిస్‌ ఇండియా నందిని గుప్తా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ గీత ఆలాపనతో పోటీలు మొదలయ్యాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహించిన కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 250 మంది కళాకారులతో పేరిణి నృత్య ప్రదర్శన చూసి అతిథులు మంత్రముగ్ధులయ్యారు.పరిచయ కార్యక్రమంలో భాగంగా పోటీదారులు విభిన్న వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, నగర మేయర్ విజయలక్ష్మి, మిస్ వరల్డ్ సీఈవో జూలియా మోర్లే, మిస్ వరల్డ్-2024 విజేత క్రిస్టినా పిస్కోవా తదితరులు ప్రారంభోత్సవ ...
HYDRAA : గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్ ప్లాన్.. పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం
State, Hyderabad

HYDRAA : గచ్చిబౌలిలో హైడ్రా యాక్షన్ ప్లాన్.. పలు అక్రమ నిర్మాణాలు నేలమట్టం

హైదరాబాద్ : గచ్చిబౌలి( Gachibowli)లో హైడ్రా (HYDRAA) కూల్చివేతలు చేపట్టింది. సంధ్య కన్వెషన్​ సెంటర్​ మినీ హాల్​(Sandhya Conventions)ను హైడ్రా నేలమట్టం చేసింది. అక్రమంగా నిర్మించిన కొన్ని ఫుడ్​ కోర్టులను కూల్చివేస్తుంది. ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా ఫిర్యాదులు అందిన తర్వాత, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తి రక్షణ సంస్థ (HYDRAA) మంగళవారం గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్స్‌లో కూల్చివేతలను నిర్వహించింది. ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన భూములు, ప్లాట్లలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రా పేర్కొంది. లేఅవుట్లు, ఆస్తి మ్యాప్‌లను చెరిపివేసి, వారు లేఅవుట్ లో రోడ్లు, పార్కులను ఆక్రమించి అనేక నిర్మాణాలను నిర్మించారు. శ్రీధర్ రావు యాజమాన్యంలోని సంధ్య కన్వెన్షన్ మినీ హాల్‌తో పాటు, వంటగది, విశ్రాంతి గదులను హైడ్రా కూల్చివేసింది. అలాగే మెటల్ షీట...
error: Content is protected !!