Congress | సీఎం రేవంత్ “పదేళ్ల పదవి” వ్యాఖ్యలపై ప్రకంపనలు
Hyderabad : : ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరో పదేళ్లపాటు తానే సీఎంగా కొనసాగుతానని చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అలజడి వ్యక్తమవుతోన్నట్లు కనిపిస్తోంది. ఈ వ్యాఖ్యలపై అనేక మంది ఎమ్మెల్యేలు బహిరంగంగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.
Congress : సీఎం రేవంత్ ఏమన్నారు?
శుక్రవారం కొల్లాపూర్ నియోజకవర్గంలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తాను 2034 వరకు పదవిలో ఉంటానని స్పష్టం చేశారు. 2034 వరకు ఈ పాలమూరు బిడ్డ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటాడని, పాలమూరు గడ్డ నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తాడని ఆయన స్పష్టం చేశారు.
అయితే, ఆయన వ్యాఖ్యలు కాంగ్రెస్ శాసనసభ్యులకు మింగుడు పడలేదు, వారిలో కొందరు ఈ వ్యాఖ్యలు అనుచితమని విమర్శించారు.ముఖ్యమంత్రి వ్యాఖ్యలను మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy) విమర్శలు గుప్పించారు. ఇటువ...




