Sarkar Live

Hyderabad

BRS Party | పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి : కేటీఆర్ సవాల్
State, Hyderabad

BRS Party | పార్టీ మారిన ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ గెలవాలి : కేటీఆర్ సవాల్

Hyderabad | పార్టీ మారిన ఎమ్మెల్యేలకు దమ్ముంటే వారి పదవులకు రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ (BRS Party ) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సవాల్ విసిరారు. రేవంత్‌ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి, ఉప ఎన్నికలకు వెళ్లాలని చెప్పారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఎన్నికలు వస్తే ఓటమి భయం పట్టుకుందని సెటైర్లు వేశారు. శేరిలింగంపల్లి (sharlingampalli) నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఓటువేసిన ప్రజలను నాయకులు మోసం చేసినా, కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్నారని కేటీఆర్ కొనియాడారు. హైదరాబాద్​ లో కాంగ్రెస్ నేతల దందాల కోసమే హైడ్రా పనిచేస్తోందని ఆరోపించారు. హైడ్రా (Hydraa) కారణంగానే హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయందన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనల...
Aarogyasri | ఆగస్టు 31 నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం : నెట్‌వర్క్ ఆసుపత్రులు
State, Hyderabad

Aarogyasri | ఆగస్టు 31 నుండి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తాం : నెట్‌వర్క్ ఆసుపత్రులు

Aarogyasri | “ఆరోగ్యశ్రీ, EHS (ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ) JHS (జ‌ర్న‌లిస్ట్ హెల్త్ స్కీమ్‌) ల లబ్ధిదారులకు ఉచిత వైద్య‌ సేవలను అందించడంలో అనేక సమస్యలు ఎదుర‌వుతున్నాయి. ఆర్థికంగా పెనుభారం మోస్తున్నామ‌ని ఆరోగ్య‌శ్రీ (Aarogyasri) నెట్ వ‌ర్క్ ఆసుపత్రులు చాలా వరకు మూసివేయబడే ప్రమాదం పొంచి ఉందని TANHA తెలిపింది. ఈ సంవత్సరం జనవరిలో, TANHA సభ్యులు ఇలాగే నిరసన తెలుప‌గా రాష్ట్ర ప్రభుత్వం వారి డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చింది. అయితే, ఎనిమిది నెలలు గడుస్తున్నా.. అనేక సమావేశాలు జరిగినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏవీ నెరవేరలేదు. TANHA యొక్క కొన్ని ప్రధాన డిమాండ్‌లు చేస్తోంది. సభ్య ఆసుపత్రులతో అవగాహన ఒప్పందాలను (నిబంధనలు షరతులు) తిరిగి రూపొందించడం, ప్యాకేజీల సవరణ, సాధారణ చెల్లింపులు, పరిష్కార యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం, ఎటువంటి ఆందోళన లేదా పరిశీలన లేకుండా ఏకపక్షంగా సర్క్యులర్‌లను జా...
Telangana Rains | మ‌రో రెండురోజులు భారీ వ‌ర్షాలు..
Hyderabad, State

Telangana Rains | మ‌రో రెండురోజులు భారీ వ‌ర్షాలు..

Telangana Rains | తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కుర‌వ‌నున్నాయ‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్ల‌డించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఈమేర‌కు గురువారం ఆదిలాబాద్‌, కొత్తగూడెం, హైదరాబాద్‌, జగిత్యాల, జ‌య‌శంక‌ర్‌ భూపాలపల్లి, కరీంనగర్‌, ఆసిఫాబాద్‌, మహబూబాబాద్‌, మంచిర్యాల, మేడ్చల్‌ మల్కాజ్‌గిరి, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల్లో వర్షాలు కురిసే అవ‌కాశాలు ఉన్నాయ‌ని పేర్కొంది. ఇక శుక్రవారం భ‌ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో మోస్తరు వర్షపాతం ఉండే సూచనలున్నాయని తెలిపింది. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం  సర్కార్ లైవ్ వెబ్ సైట్ ను సందర్శించండి.  అలాగే మా  ఫేస్ బుక్,వాట్సప్ చానల్, ఎక్స్(ట్విట్టర్)  ను  ఫాలో అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయం...
Registration Buildings |  సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు
State, Hyderabad

Registration Buildings | సకల సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు

ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాలు Integrated Registration Buildings : రాష్ట్రంలో అన్ని స‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌యాల‌ను ద‌శ‌ల వారీగా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌నాల ప‌రిధిలోకి తీసుకువ‌స్తామ‌ని రెవెన్యూ, హౌసింగ్‌, స‌మాచార పౌర‌సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి వెల్ల‌డించారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బుధ‌వారం గ‌చ్చిబౌలిలోని తాలిమ్‌లో ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేష‌న్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న జ‌రిగిన సంద‌ర్బంగా ఏర్పాటైన స‌భ‌లో మంత్రి పొంగులేటి ప్ర‌సంగించారు. దేశంలోని 18 రాష్ట్రాల‌లో అధ్య‌య‌నం చేసి భూభార‌తి -2025 చ‌ట్టాన్ని రూపొందించామ‌న్నారు. రాష్ట్రంలో ఒక్కొక్క‌టిగా అభివృద్ది కార్యక్ర‌మాలు అమ‌లు జ‌రుగుతున్నాయ‌ని, దానిలో భాగంగానే ఈ ఇంటిగ్రేటెడ్ స‌బ్ రిజిస్ట్రార్ భ‌వ‌నాల శంకుస్దాప‌న అని వివ‌రించారు. ప్రస్తుతం జిహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ ప‌రిధిలోగ‌ల ...
Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..
Hyderabad, State

Electric Shock | వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌ షాక్‌..

ఇద్దరు యువకులు దుర్మరణం Hyderabad News | హైదరాబాద్‌ రామంతాపూర్‌లో (Ramanthapur) శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో ఐదుగురు మృతిచెందిన‌ విషాదక‌ర ఘ‌ట‌న మరువకముందే బండ్లగూడలో (Bandlaguda) ఇదే త‌ర‌హా మరో ఘటన చోటుచేసుకుంది. వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండగా క‌రెంట్ షాక్‌తో (Electric Shock) ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కొందరు యువకులు భారీ వినాయక విగ్రహాన్ని తీసుకెళ్తుండ‌గా బండ్లగూడ వద్ద గ‌ణేష్‌ విగ్రహానికి హై టెన్షన్‌ వైరు తరగలడంతో ట్రాక్టర్‌కు విద్యుత్ ప్ర‌సార‌మైంది. దీంతో ఇద్దరు యువకులకు షాక్ త‌గిలి అక్కడికక్కడే మరణించారు. ఈ ఘ‌ట‌న‌లో మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్క‌డికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిని అఖిల్‌ అనే యువకుడిని హాస్పిట‌ల్ కు తరలించారు. మృతులను టోని (21), వికాస్‌ (20)గా గుర్తించారు. కరెంటు షాక్‌తో ట్రాక్టర్‌ టైర్లు పూర్తిగా ద...
error: Content is protected !!