Secunderabad | ప్రయాణికులకు గుడ్ న్యూస్.. పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
Secunderabad : ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో పలు కీలక మార్గాల్లో తాత్కాలికంగా ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మేరకు రైల్వే అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.
Secunderabad -ఆర్సీకేరే (07079/ 07080) ప్రత్యేక రైలు ఈనెల 13 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతీ ఆదివారం సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు అర్పికేరేలో బయ లుచేరి మరుసటి రోజు ఉదయం 7.45 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
హైదరాబాద్-అర్సికెరే (07060/07010)
హైదరాబాద్-అర్సీకేరీ (07060/07010) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8 నుంచి ఆగస్టు 26 వరకు ప్రతి మంగళవారం సాయంత్రం 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 12.45కు చేరుకుం టుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 8వ తేదీ నుంచి ఆగస్టు 27 వరకు ప్రతి ...




